Anupama Parameswaran: చీరకట్టులో కుందనపు బొమ్మల మెరిసిపోతున్న అనుపమ.. ఇదే మాకు కావాల్సింది అంటూ?

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 12:48 PM IST

టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెకు తెలుగులో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ లలో అనుపమ కూడా ఒకరు. అయితే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన అనుపమ ఆ తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం అను మళ్ళీ వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.

We’re now on WhatsApp. Click to Join
ఇటీవల టిల్లు స్క్వేర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది మలయాళీ కుట్టి. దాదాపు పదేళ్ల తర్వాత మొదటి సారి గ్లామర్ హీరోయిన్‏గా కనిపించింది. ఇందులో లిల్లీ పాత్రలో కనిపించి షాకిచ్చిన సంగతి తెలిసిందే. టిల్లు స్క్వేర్ మూవీ రిలీజ్ కంటే ముందు విడుదలైన టీజర్, ట్రైలర్ అనుపమ లుక్స్ చూసి ఫ్యాన్స్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తమ ఆరాధ్య దేవత ఇలాంటి రోల్స్ చేస్తుందేంటీ అని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కానీ టిల్లు స్క్వేర్ సినిమా చూసిం తర్వాత అనుపమ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీలో అనుపమ పాత్ర కొత్తగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Dimple Hayathi: అదేంటి డింపుల్ హయతి అలా మారిపోయింది.. గుర్తుపట్టడం కష్టమే?

ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్ అవుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా అనుపమ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్లు మోడ్రన్ లుక్ లో కనిపించిన అనుపమ ఇప్పుడు పట్టుచీరలో ఎంతో పద్దతిగా హోమ్లీగా కనిపించింది. గ్రీన్ కలర్ సారీతో ఉన్న ఫోటోలను అనుపమ తాజాగా దానిని ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అనుపమ అందమైన ఫోటోస్ చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోయిన్ అనుపమ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పట్టుచీరలో ఎంతో క్యూట్ గా పద్దతిగా కనిపిస్తుందని అంటున్నారు.

Also Read: Suriya – Jyothika: భర్తతో కలిసి జిమ్లో వర్కౌట్స్ చేస్తూ తెగ కష్టపడుతున్న జ్యోతిక.. వీడియో వైరల్!

అనుపమ ఫోటోస్ పై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సైతం స్పందించారు. అచ్చం అప్సరలా ఉందంటూ కామెంట్ చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అనుపమ షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఇదే మాకు కావాల్సింది అనుపమను మేము ఇలాగే చూడాలి అనుకున్నాము లిల్లీ గా కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.