ఇద్దరు అమ్మాయిలు తో మూవీ లో అల్లు అర్జున్ (Allu Arjun) సరసన జోడి కట్టిన అమలా పాల్ (Amala Paul)..తాజాగా బోల్డ్ (Amala Paul Bold) అవతారంలో అబ్బా అనిపించింది. అమలాపాల్ (Amala Paul)..బెజవాడ మూవీ తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈ చిన్నది..ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత 2014లోనే దర్శకుడు ఏల్ విజయ్ (VIjay) ని పెళ్లి (Marriage ) చేసుకుంది. మూడేళ్ల కాపురం తర్వాత విడాకులు (Divorce) తీసుకుంది. అప్పటి నుంచి సింగిల్ గానే జీవితం గడుపుతూ వచ్చింది.
గత సంవత్సరం జగత్ దేశాయ్ అనే బిజినెస్ మెన్ ని ప్రేమించినట్టు తెలిపి రెండో పెళ్లి చేసుకుంది. వెంటనే తన ప్రగ్నెన్సీ కూడా ప్రకటించింది. జూన్ లో వీరికి ఒక కొడుకు కూడా పుట్టారు. గత సంవత్సరం నవంబర్ లో వీరు పెళ్లి చేసుకున్నారు. అమలాపాల్ కి ప్రగ్నెన్సీ వచ్చాక పెళ్లి చేసుకుందని అంత మాట్లాడుకున్నారు. ఇక సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే అమలా తాజాగా ఓ బోల్డ్ లుక్ లో కనిపించి అబ్బా అనిపించింది. రీసెంట్ గా అమలాపాల్ తన బర్త్ డే ను భర్తతో కలిసి బాలి వెళ్లి సెలబ్రేట్ చేసుకుంది. తన సెలబ్రేషన్స్ లో పలు హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Read Also : Green Tea: గ్రీన్ టీతో అందాన్ని పెంచుకోవచ్చని మీకు తెలుసా?