Akira Nandan Mamitha Baiju Love Story : అకిరా నందన్ తో మమితా బైజు.. ఈ కాంబో సెట్ అయితే మాత్రం..!

Akira Nandan Mamitha Baiju Love Story పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కి ఇప్పటికే యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పడింది.

Published By: HashtagU Telugu Desk
Akira Nandan Mamitha Baiju Love Story Combination Power Star Fans Hungama

Akira Nandan Mamitha Baiju Love Story Combination Power Star Fans Hungama

Akira Nandan Mamitha Baiju Love Story పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కి ఇప్పటికే యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అకిరా నందన్ ని హీరో చేయాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ అడుగుతుంటే అకిరా మాత్రం మ్యూజిక్ కంపోజర్ గా షాక్ ఇచ్చాడు. ఐతే ఈమధ్య తరచు పవన్ తో కనిపిస్తున్న అకిరా నందన్ పీకే ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాడు. లేటెస్ట్ గా తమ్ముడు రీ రిలీజ్ టైం లో కూడా అకిరా నందన్ షోకి అటెండ్ అవ్వడంతో థియేటర్ దద్దరిల్లిపోయింది.

ఇదిలాఉంటే అకిరానందన్ హీరోగా చేస్తే హీరోయిన్ గా ప్రేమలు హీరోయిన్ మమితా బైజు పర్ఫెక్ట్ అని అంటున్నారు. అకిరా నందన్, మమితా బైజు కలిసి ఒక క్యూట్ లవ్ స్టోరీ చేస్తే అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని.. ఈ కాంబో సెట్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ప్రేమలు సినిమాలో హీరోయిన్ గా నటించిన మమితా బైజుకి యూత్ లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది.

మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్న మమితా తెలుగు ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంది. ఒకవేళ అకిరా తో మమితా జోడీ ఫిక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. అకిరా తో లవ్ స్టోరీస్ ప్లాన్ చేస్తే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవుతాయని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు.

Also Read : Mahesh Babu Kurchi Madatapetti Song : 300 మిలియన్ వ్యూస్ దాటేసిన కుర్చీ మడతపెట్టి సాంగ్..!

  Last Updated: 16 Jun 2024, 11:14 AM IST