Site icon HashtagU Telugu

Akhil Wedding : అట్టహాసంగా అఖిల్ పెళ్లి వేడుక..అతిధులు ఎవరెవరు వచ్చారంటే !!

Akhil Wedding Pics

Akhil Wedding Pics

అక్కినేని కుటుంబంలో మరో సంతోషకర ఘటన చోటు చేసుకుంది. అఖిల్ అక్కినేని ప్రేమలో ఉన్న జైనాబ్ రావ్జీతో వివాహ బంధంలోకి (Akhil -Zainab Ravdjee) అడుగుపెట్టాడు. ఈ వేడుక నాగార్జున నివాసంలో అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది. కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వేడుక ఎంతో ప్రత్యేకంగా, సంప్రదాయబద్ధంగా సాగింది. అక్కినేని కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళి జంట ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అఖిల్ కజిన్స్ సుశాంత్, సుమంత్ సందడి చేశారు.

Golden Temple: స్వర్ణ దేవాలయం వద్ద ఉద్రిక్తత.. ఆపరేషన్ బ్లూ స్టార్ వార్షికోత్సవంలో ఖలిస్థాన్ నినాదాలు

చిత్రసీమ నుంచి పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, రామ్ చరణ్ ఈ వేడుకకు విచ్చేసారు. దర్శకుడు ప్రశాంత్ నీల్, క్రికెటర్ తిలక్ వర్మ, డిజైనర్ శిల్పారెడ్డి వంటి ప్రముఖులు కూడా అఖిల్ పెళ్లికి హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించి ఫోటోలు నాగార్జున సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ పెళ్లి వేడుకలో అతి సమీప బంధువులు మాత్రమే ఉండటంతో ఎంతో సన్నిహితంగా, ఆత్మీయంగా జరిగిందని సమాచారం.

Trump: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌.. మీరు చిన్న పిల్లలా అంటూ ట్రంప్ వ్యాఖ్య

జైనాబ్ రావ్జీ (Zainab Ravdjee) విషయానికి వస్తే.. ఆమె పార్సీ ఫ్యామిలీకి చెందినవారు. ఆమె తండ్రి జుల్ఫీ ఒక ప్రముఖ పరిశ్రమల అధినేతగా ఉన్నారు. గతంలో ఏపీ ప్రభుత్వంలో క్యాబినెట్ హోదా కలిగిన పదవిలో పనిచేశారు. జైనాబ్ హైదరాబాద్‌లో జన్మించి, తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యారు. ఆమె ఒక ఆర్టిస్ట్ – పెయింటింగ్స్ చేస్తూ, వివిధ నగరాలలో మరియు అంతర్జాతీయ ప్రదర్శనలలో తన కళను ప్రదర్శించారు. అఖిల్ విషయానికి వస్తే.. ‘సిసింద్రీ’ సినిమాతో చిన్న వయసులో తెరంగేట్రం చేసి, ‘అఖిల్’, ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, ‘ఏజెంట్’ వంటి సినిమాల్లో నటించి, ప్రస్తుతం ‘లెనిన్’ అనే సినిమాను చేస్తున్నాడు.