Mahesh Rajamouli : మహేష్ తర్వాత రాజమౌళి హీరో అతనేనా.. ఎవరు ఊహించని కాంబో..!

Mahesh Rajamouli సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి తన నెక్స్ట్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడని తెలిసిందే. ఎస్.ఎస్.ఎం.బి 29వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా త్వరలో ప్రెస్ మీట్ పెట్టి

  • Written By:
  • Publish Date - March 14, 2024 / 11:35 AM IST

Mahesh Rajamouli సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి తన నెక్స్ట్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడని తెలిసిందే. ఎస్.ఎస్.ఎం.బి 29వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా త్వరలో ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి వెల్లడిస్తారట మేకర్స్. సినిమాకు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు కాగా త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. అయితే రాజమౌళి ఈ సినిమాను మూడు నాలుగేళ్లలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

మహేష్ రాజమౌళి సినిమా కూడా రెండు భాగాలుగా వస్తుందని తెలుస్తుంది. మొదటి భాగం ఒక రెండేళ్లలో రెండో భాగం మరో రెండేళ్లలో పూర్తి చేస్తారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి ఏ హీరోతో చేస్తాడు అన్న డిస్కషన్ మొదలైంది. మహేష్ తో సినిమా చేశాక కదా ఆ సంగతి అంటే అలా కాదు ముందే లైనప్ పెట్టుకోవాలని జక్కన్న చూస్తున్నాడట.

ఈ క్రమంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ రాజమౌళి సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. RRR తో ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఆ తర్వాత మహేష్ తో చేస్తున్న సినిమాను హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని ప్లానింగ్ లో ఉన్నాడట. అదే జరిగితే మాత్రం విజయ్ దేవరకొండ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని చెప్పొచ్చు.

Also Read : Nabha Natesh : నభా నటేష్ పాన్ ఇండియా ఛాన్స్.. నిఖిల్ భారీ సినిమాలో అలాంటి పాత్రలో..!