Site icon HashtagU Telugu

Lavanya : ఆఫ్టర్ మ్యారేజ్ మెగా కోడలు సినిమాలు చేస్తుందా..?

Afer Marriage Lavanya Will Do Movies Or Not

Afer Marriage Lavanya Will Do Movies Or Not

Lavanya మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల మ్యారేజ్ ఇటలీలో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ (Mega Family)మెంబర్స్ తో పాటుగా అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వరుణ్ లావణ్యల వివాహం జరిగింది. పెళ్లికి సంబందించిన ఫోటోలు మెగా హీరోల సందడికి సంబందించిన పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిరు (Chiranjeevi) టూ వైష్ణవ్ తేజ్ అందరు మెగా హీరోలు ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.

నిన్నటిదాకా కేవలం హీరోయిన్ మాత్రమే అయిన లావణ్య ఇప్పుడు మెగా కోడలిగా మారింది. మెగా కోడలిగా చాలా పెద్ద బాధ్యత మోయాల్సి ఉంది. ఇంతకీ లావణ్య ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు చేస్తుందా..? పెళ్లికి వరుణ్ తేజ్ (Varun Tej) ఏదైనా కండీషన్స్ పెట్టాడా లాంటి విషయాలు బయటకు రాలేదు. కానీ హీరోయిన్ గా లావణ్య కెరీర్ అంత ఆశాజనకంగా ఏమి లేదు. పెళ్లి తర్వాత తను పూర్తిగా ఫ్యామిలీని చూసుకోవాలనే ఫిక్స్ అయ్యిందట.

మెగా ఫ్యామిలీ కూడా అదే కోరడంతో వరుణ్ లావణ్య పెళ్లికి వారు అంగీకరించారని తెలుస్తుంది. ఐదారేళ్లుగా సీక్రెట్ లవ్ స్టోరీ నడిపించిన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలు పెళ్లి తో ఒకటయ్యారు. సెలబ్రిటీ మ్యారేజ్ లకు ఉండే క్రేజ్ తెలిసిందే. అందుకే నిన్నటి నుంచి వరుణ్ లావణ్యల మ్యారేజ్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Also Read : Ram Charan : మొన్న ఎన్టీఆర్ నేడు రామ్ చరణ్.. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో తెలుగు స్టార్స్..!

We’re now on WhatsApp : Click to Join