Site icon HashtagU Telugu

Honey Rose: విజయవాడ అంటే నాకు చాలా ఇష్టం.. హనీ రోజ్ కామెంట్స్ వైరల్?

Honey Rose

Honey Rose

హానీ రోజ్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలయ్య బాబు సినిమాతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది హాని రోజ్. అయితే నిన్న మొన్నటి వరకు ఈమె ఎవరు అన్నది చాలా మందికి తెలియదు. కానీ తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలలో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది హనీ రోజ్. ఈ సినిమా విడుదలకు ముందు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈమె పేరు కొద్దిరోజుల పాటు మారు మోగిపోయింది. ఇక ఈమె అందానికి యువత ఫిదా అయిపోయారు.

వీర సింహారెడ్డి సినిమా తర్వాత అబ్బాయిల కలల రాకుమారిగా మారిపోయింది అని హనీ రోజ్. కాగా ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వరుసగా క్యూపడుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె విజయవాడలో సందడి చేసింది. విజయవాడ నగరంలోని జైహింద్‌ కాంప్లెక్స్‌ నందు దేవి పవిత్ర గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షోరూంలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్రైడల్‌ విభాగాన్ని తాజాగా హనీ రోజ్‌ ప్రారంభించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. కాగా డైమండ్స్ షోరూమ్ ని ఓపెన్ చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ విజయవాడ నగరం అంటే తనకెంతో ఇష్టమని తెలిపింది.

అంతేకాకుండా విజయవాడ ప్రజలు చూపించే అభిమానం మరువలేనిది అని ఆమె చెప్పుకొచ్చింది. అనంతరం నగల గురించి మాట్లాడుతూ.. షోరూంలో బ్రైడల్‌ కలెక్షన్స్‌ అద్భుతంగా ఉన్నాయన్నారు. డైమండ్‌ సెట్‌ ధరించి చూశానని, చాలా బాగా ఉందన్నారు. దేవి పవిత్ర గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ షోరూం లోనే తాను డైమండ్స్‌ కొనుగోలు చేస్తానన్నారు. నగరంలోని మహిళలు షోరూం కు వచ్చి కలెక్షన్స్‌ వీక్షించి కొనుగోలు చేయాలని కోరారు. షోరూం అధినేత రాజేష్‌ మాట్లాడుతూ తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు నూతన మోడల్స్‌, నాణ్యత, మన్నికతో బంగారు, వజ్ర ఆభరణాలను అందిస్తున్నామని తెలిపారు షోరూం అధినేత రాజేష్.