Anasuya Bharadwaj : సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ మహిళా ఆర్టిస్టులను వాడుకోవడానికి చాలామంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు ప్రయత్నాలు చేస్తుంటారని నటి అనసూయ భరద్వాజ్ ఆరోపించారు. తనను కూడా గతంలో ఆ విధంగా టార్గెట్ చేసేందుకు కొందరు యత్నించారని ఆమె తెలిపారు. ‘‘ఓ స్టార్ హీరో అడిగితే.. నేను డైరెక్ట్‌గా నో చెప్పేశాను. ఓ పెద్ద డైరెక్టర్ ప్రపోజ్ చేస్తే సున్నితంగా తిరస్కరించాను. అలా చెప్పడం వల్ల నాకు చాలా ఆఫర్లు రాకుండా చేశారు’’ అని అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :Powerful Shoes : కామాంధులకు షాకిచ్చే ‘పవర్’ఫుల్ షూస్.. మహిళలకు సేఫ్టీ
మార్పు రావాలి..
‘‘సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే మహిళా ఆర్టిస్టులకు నో చెప్పే తెగువ ఉండాలి. అలా చెప్పడం వల్ల క్రియేటయ్యే సవాళ్లను ఎదుర్కొనే సహనం ఉండాలి. నేను ఓపిగ్గా కెరీర్‌లో ముందుకు వెళ్తున్నాను. తొందరేం లేదు’’ అని అనసూయ(Anasuya Bharadwaj) చెప్పుకొచ్చారు. ‘‘సినిమాల్లో అలాంటి నీచమైన వ్యవహారాలకు చోటు ఉండకూడదు. కళను, ప్రతిభను చూసి మహిళా ఆర్టిస్టులకు అవకాశాలు ఇవ్వాలి. అలాంటి మార్పు వస్తేనే చాలామంది అమ్మాయిలు సినిమా రంగంలోకి వస్తారు’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
Also Read :BRS : బీఆర్ఎస్ పార్టీ విప్‌లను ప్రకటించిన కేసీఆర్
ఈజీవేను ఎంచుకుంటున్నారు
‘‘కొంతమంది సినీ ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ఈజీవేను ఎంచుకుంటున్నారు. అది సరైన నిర్ణయం కాదు. వేరే వాళ్లు తప్పు చేస్తున్నారు కదా అని, మనం కూడా చేయకూడదు. ప్రతిభ ఆధారంగా వస్తే చాలా కాలం పాటు ఇండస్ట్రీలో నిలువగలుగుతారు’’ అని అనసూయ సూచించారు. ‘‘నన్ను ఇష్టపడే వాళ్ళ కోసమే సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తాను. అక్కడ ఎలాంటి ఫోటోలు షేర్ చేయాలనేది నా ఇష్టం. బికినీ వేసుకోవాలా? మొత్తం విప్పి తిరగాలా ? అనేది నా ఇష్టం. దానివల్ల ఎవరికీ ఇబ్బందిలేదు. అయినా నాపై మీ పెత్తనమేంటి ?’’ అని ఆమె ప్రశ్నించారు. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ఆకర్షణ అనేది ఏ రంగంలోనైనా సర్వసాధారణ అంశమన్నారు.