Samantha Prayer 2025 : సినీ నటి సమంత తన లైఫ్ పార్ట్‌నర్ కోసం చాలా ఆతురతగా వెతుకుతున్నారు. కనీసం వచ్చే సంవత్సరం (2025లో) తనకొక మంచి జీవిత భాగస్వామి దొరకాలని ఆమె మనసారా కోరుకుంటున్నారు. ఈమేరకు ఏసు ప్రభువును ప్రార్థిస్తూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సమంత ఒక సంచలన పోస్ట్ పెట్టారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాబోయే 2025 సంవత్సరం తన రాశికి ఎలా ఉంటుంది అనే వివరాలను పోస్ట్‌లో సమంత ప్రస్తావించారు. అందులో చెప్పిన విధంగా జరగాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Also Read :Cyber Horror 2024 : 2024లో సెకనుకు 11 సైబర్ మోసాలు.. 36.9 కోట్ల మాల్‌వేర్లతో దాడులు.. 5,842 హ్యాక్టివిస్టుల ఎటాక్స్
సమంత చేసిన ఇన్‌స్టా పోస్ట్ ప్రకారం.. వృషభ, కన్య, మకర రాశి వారు 2025 సంవత్సరంలో కొన్ని కానుకలను అందుకుంటారు. దీని ప్రకారం.. ఈ రాశుల వారు వచ్చే ఏడాదిలో నమ్మకం, ప్రేమను అందించే జీవిత భాగస్వామిని పొందుతారు. పిల్లలను పొందుతారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ అవుతారు. సమంత కోరుకుంటున్నవి కూడా ఇవే. అందుకే ఈ అంశాలను ఆమె తన మెసేజ్‌లో హైలైట్ చేశారు. వృషభ, కన్య, మకర రాశి వారు రాబోయే సంవత్సరంలో బిజీగా గడుపుతారు. ప్రొఫెషనల్‌గా డెవలప్ అవుతారు. డబ్బు బాగా సంపాదిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. జీవిత లక్ష్యాలను సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. కొత్త అవకాశాలు సొంతం అవుతాయి.
Also Read : Sana Sathish : టీడీపీ రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్ ఎవరు ? ఆయన నేపథ్యం ఏమిటి ?
సమంత(Samantha Prayer 2025) పోస్ట్‌కు స్పందిస్తూ.. ఆమె కోరుకుంటున్న విధంగానే అన్నీ జరగాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ మెసేజ్‌లు పెడుతున్నారు. మొత్తం మీద సమంత కొత్త సంవత్సరంలో కొత్త లైఫ్ పార్ట్‌నర్‌తో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం అవుతోంది. ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను సమంత అలరించారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న మరో వెబ్‌సిరీస్ ‘రక్త్ బ్రహ్మాండ్’. ది బ్లడీ కింగ్‌డమ్ అనేది దీని సబ్ టైటిల్.