టాలీవుడ్ మన్మథుడు, కింగ్ అక్కినేని నాగార్జున వెండితెరపై హీరోగా అడుగుపెట్టి నేటితో (మే 23) సరిగ్గా 40 వసంతాలు పూర్తయ్యాయి. 66 ఏళ్ల వయసులోనూ నవమన్మథుడిలా మెరిసిపోతూ, వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాగ్.. ఈ ప్రత్యేకమైన రోజున సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన సినీ ప్రస్థానంలో ‘మే 23’ తేదీకి ఉన్న విడదీయరాని అనుబంధాన్ని ఆయన అభిమానులతో పంచుకున్నారు.
టాలీవుడ్ సీనియర్ హీరోలలో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. దివంగత లెజెండరీ నటుడు ఏఎన్నార్ వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన సినిమాలు, విలక్షణమైన పాత్రలు చేస్తూ ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్నారు. ఎప్పటికప్పుడు న్యూ టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని పిలవబడుతున్నారు. 66 ఏళ్ల వయసులోనూ రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్న నాగ్, నేటితో హీరోగా 40 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు.
Thank you for all the blessings and love being showered on me today🙏🙏🙏
May 23!! the date I cannot forget!!
The day which I had the honour of producing and releasing the last film MANAM of my legendary father ANR🙏 the film which I had the privilege of working both with my…— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 23, 2026
‘విక్రమ్’ సినిమాతో నాగార్జున హీరోగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ 1986 మే 23న విడుదలైంది. అంటే ఈ రోజుకి సినిమా వచ్చి నలభై ఏళ్లు పూర్తయింది. యాదృచ్ఛికంగా 2014లో అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా ‘మనం’ ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకే ‘మే 23’ తన జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకమని నాగ్ అన్నారు. ‘విక్రమ్’ విడుదలై నేటికి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తనను ఆదరిస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
From #Vikram to every milestone after that setting trends with bold daring steps inspiring me , filmmakers and generations . Thank you king ❤️ @iamnagarjuna
Marking #12YearsForClassicManam #ANRliveson a film that will always stay special to me and fortunate to be part of .… pic.twitter.com/Dt6Bq65BpM
— chaitanya akkineni (@chay_akkineni) May 23, 2026
ఈ రోజు నాపై కురిపిస్తున్న ఆశీర్వాదాలకు, ప్రేమకు మీ అందరికీ ధన్యవాదాలు. మే 23.. ఇది నేను ఎప్పటికీ మరువలేని తేదీ. నా తండ్రి లెజెండరీ ఏఎన్నార్ గారి చివరి చిత్రం ‘మనం’ నిర్మించి విడుదల చేసే అరుదైన గౌరవం నాకు దక్కిన రోజు ఇది. నా తండ్రితోనూ, నా కుమారులతోనూ కలిసి పనిచేసే అదృష్టం నాకు లభించిన సినిమా అది. కొన్నేళ్ల క్రితం, ఇదే మే 23వ తేదీన నా మొదటి చిత్రం ‘విక్రమ్’ విడుదల చేయబడింది. మీ అందరినీ అలరించే, మీ ఆశీర్వాదాలను, ప్రేమను పొందే అదృష్టం నాకు దక్కింది. ఇన్నేళ్లుగా నా వెన్నంటి నిలిచిన అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భవిష్యత్తులో మరిన్ని ‘మే 23’లు నా జీవితంలో రావాలని కోరుకుంటున్నాను అని నాగార్జున తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
నాగార్జున హీరోగా మధుసూధనరావు దర్శకత్వంలో ‘విక్రమ్’ సినిమా తెరకెక్కింది. ఇందులో నాగ్ సరసన శోభన హీరోయిన్ గా నటించారు. ఇది 1983లో హిందీలో విడుదలైన ‘హీరో’ సినిమాకు తెలుగు రీమేక్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని వెంకట్ పేరు మీదుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. 1986లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అయితే నాగ్ మూస ధోరణిలో వెళ్లకుండా, ఎప్పటికప్పుడు కొత్తదనం వైపు అడుగులు వేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. స్టార్‌డమ్ పక్కనపెట్టి ఎన్నో ప్రయోగాలు చేశారు. మాస్, క్లాస్, యాక్షన్, డివోషనల్, ఫాంటసీ, రొమాంటిక్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ, ట్రాజెడీ, ఎంటర్టైన్మెంట్, థ్రిల్లర్..ఇలా ప్రతి జోనర్‌లో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరో నాగార్జున అని చెప్పాలి.
నాగార్జున ప్రస్తుతం తన కెరీర్ లో మైలురాయి అయిన 100వ సినిమాలో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వంలో ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘లాటరీ కింగ్’ అనే పేరు ప్రచారంలో ఉంది. ఇందులో టబు, ఐశ్వర్య రాజేష్, సుష్మితా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నాగ్ వింటేజ్ లుక్ లో కనిపించనున్నారు.
