Zomato: పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు భారతదేశంపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు చమురు కంపెనీలు దేశంలో విక్రయించే ప్రీమియం పెట్రోల్ ధరలను దాదాపు రూ. 2 వరకు పెంచగా మరోవైపు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కూడా ఖరీదైనదిగా మారింది. జొమాటో ప్రతి ఆర్డర్‌పై ప్లాట్‌ఫారమ్ ఫీజును రూ. 2.40 పెంచింది, దీనివల్ల కస్టమర్లపై అదనపు భారం పడనుంది.
జొమాటో తన యాప్‌లో అందించిన సమాచారం ప్రకారం.. వినియోగదారుల నుండి వసూలు చేసే ప్లాట్‌ఫారమ్ ఫీజును ప్రతి ఆర్డర్‌పై రూ. 2.40 పెంచింది. జీఎస్టీ (GST) కంటే ముందు లెక్కల ప్రకారం.. జొమాటోలో ప్లాట్‌ఫారమ్ ఫీజు గతంలో ఉన్న రూ. 12.50 నుండి ఇప్పుడు రూ. 14.90 కి పెరిగింది.
ఇంతకుముందు ఇటువంటి ధరల పెంపు సెప్టెంబర్ 2025లో జరిగింది. పన్నులతో కలిపి జొమాటో ప్రత్యర్థి సంస్థ అయిన స్విగ్గీ ప్రస్తుతం ప్రతి ఆర్డర్‌పై రూ. 14.99 ఫీజును వసూలు చేస్తోంది. సాధారణంగా ఈ రెండు కంపెనీలు ఇటువంటి ఛార్జీల మార్పు విషయంలో ఒకరినొకరు అనుసరిస్తుంటాయి.
Also Read: కొత్త ఆదాయపు పన్ను నిబంధనలలో మార్పులివే!
అర్బన్ మొబిలిటీ స్టార్టప్ అయిన రాపిడో (Rapido), బెంగళూరులో తన ఫుడ్ డెలివరీ సర్వీస్ ‘ఓన్లీ’ (Ownly)ని ప్రారంభించిన సమయంలోనే ఈ ధరల పెంపు చోటుచేసుకోవడం గమనార్హం. కేవలం డెలివరీ ఛార్జీ మినహా కస్టమర్ల నుండి లేదా రెస్టారెంట్ల నుండి ఎటువంటి అదనపు ఫీజులు వసూలు చేయబోమని రాపిడో ప్రకటించింది. డెలివరీ ఛార్జీ మినహా కస్టమర్ల నుండి లేదా రెస్టారెంట్ల నుండి ఎటువంటి అదనపు ఫీజులు వసూలు చేయబోమని ఆ కంపెనీ స్పష్టం చేసింది.
రాపిడో తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం ఉన్న కంపెనీలపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫుడ్ ఆర్డర్‌లపై అదనంగా కలుపుతున్న రకరకాల ఛార్జీలపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ ప్లాట్‌ఫారమ్ ఫీజుల పెంపు జరిగింది. పెరిగిన ఇంధన ధరలు డెలివరీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయి. ఇది అటు రెస్టారెంట్లకు, ఇటు డెలివరీ భాగస్వాములకు ఇబ్బందిగా మారవచ్చు. వినియోగదారుల విషయానికొస్తే ఈ మార్పు వల్ల ప్రతి ఆర్డర్‌పై మొత్తం బిల్లు భారం పెరుగుతుంది. అయినప్పటికీ ఈ రంగంలో పోటీ నిరంతరం మారుతూనే ఉంది.
