Adani Rebound : అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మంగళవారం స్టాక్ మార్కెట్‌లో రీబౌండ్ అయ్యాయి. ఒక్క అదానీ పెయింట్స్ మినహా మిగితావన్నీ లాభాల్లోనే ఇవాళ ట్రేడింగ్‌ను షురూ చేశాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 6 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 4 శాతం, ఎన్డీటీవీ 2.56 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 2.55 శాతం మేర లాభాలతో ట్రేడవుతున్నాయి. అదానీ విల్మార్ 2.15 శాతం, ఏసీసీ 1.93 శాతం, అదానీ పవర్ 1.74 శాతం, అదానీ పోర్ట్స్ 1 శాతం, అంబుజా సిమెంట్స్ 0.43 శాతం లాభాల్లో ఉన్నాయి. అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ కంపెనీ ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. బెర్ముడా, మారిషస్‌లలోని అదానీ గ్రూప్ షెల్ కంపెనీలలో సెబీ ఛైర్ పర్సన్ మాధవీ పురి బుచ్ దంపతులకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. అందుకే గతంలో తాము విడుదల చేసిన నివేదికపై, అదానీ గ్రూపునకు విదేశాల్లో ఉన్న డొల్ల కంపెనీలపై సెబీ దర్యాప్తు చేయించలేదని హిండెన్ బర్గ్ పేర్కొంది. దీంతో సోమవారం అదానీ గ్రూప్ స్టాక్స్ కొంత నష్టాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా మంగళవారం అవి రికవరీని(Adani Rebound) సాధించాయి.
We’re now on WhatsApp. Click to Join
సెబీ ఛైర్ పర్సన్‌కు హిండెన్‌బర్గ్ మరో సవాల్
మరోవైపు హిండెన్ బర్గ్ తాజాగా మరోసారి కీలక ప్రకటన చేసింది. విదేశాల్లోని అదానీ గ్రూపు డొల్ల కంపెనీల్లో వాటాలు లేవని సెబీ ఛైర్ పర్సన్ నిరూపించువాలోని సవాల్ విసిరింది. ఇక సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్‌కు స్థిరాస్తి పెట్టుబడుల ట్రస్టు (రీట్స్), ప్రత్యామ్నాయ పెట్టుబడుల సంఘాలు మద్దతును ప్రకటించాయి. హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఇండియన్ రీట్స్ అసోసియేషన్ పేర్కొంది.
Also Read :DDOS Attack : ట్రంప్‌ను మస్క్ ఇంటర్వ్యూ చేస్తుండగా ‘డీడీఓఎస్ ఎటాక్’.. ఏమిటిది ?
10 కంపెనీలు.. రూ.17 లక్షల కోట్ల విలువ
అదానీ గ్రూప్‌నకు భారత స్టాక్ మార్కెట్‌లో 10 నమోదిత కంపెనీలు ఉన్నాయి. వీటి మొత్తం మార్కెట్ విలువ రూ.17 లక్షల కోట్లుగా నమోదైంది. వాటిలో 8 కంపెనీల షేర్లు సోమవారం రోజు నష్టాలను చవిచూశాయి. అయితే సోమవారం మార్కెట్ సెషన్ ముగిసే సమయానికి అవి ఆరంభ నష్టాల నుంచి రికవర్ అయ్యాయి. సోమవారం రోజు ఒకానొక దశలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ 5.5%, అదానీ ఎనర్జీ 17% మేర పడిపోవడం గమనార్హం.