Bank Account Nominees: ఇప్పటివరకు మనం బ్యాంకు అకౌంటును ఓపెన్ చేసే క్రమంలో నామినీ పేరును మాత్రమే ఇచ్చాం. ఇకపై నామినీ ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ వివరాలను కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ దిశగా దేశంలోని అన్ని బ్యాంకులకు స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రెడీ అవుతోంది. ఈమేరకు బ్యాంకులు నామినీ ఫామ్‌లలో మార్పులు చేయనున్నాయి. వాటిలో ఈమెయిల్, ఫోన్ నంబరు, ఇంటి అడ్రస్ వంటి బాక్స్‌లను కొత్తగా చేర్చనున్నాయి. ఇప్పటికే బ్యాంకు ఖాతాలు ఉన్నవాళ్లంతా తమ నామినీలకు సంబంధించిన ఈవివరాలన్నీ బ్యాంకుల్లో సమర్పించాలి. కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరిచే వాళ్ల నుంచి అప్పటికప్పుడు ఈ వివరాలన్నీ తీసుకుంటారు. దీనివల్ల బ్యాంకుల వద్ద ఖాతాదారులతో సంబంధమున్న నామినీల సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.
Also Read :Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు.. ఎందుకు ? ఏం చేశారు ?
ఎందుకీ మార్పు ?
బ్యాంకు ఖాతాలు కలిగిన వారి నామినీలపై ఆర్‌బీఐ(Bank Account Nominees) ఎందుకింత శ్రద్ధ చూపుతోంది ? నామినీలను కాంటాక్ట్ చేసేందుకు అవసరమైన సమాచారాన్ని ఎందుకు సేకరిస్తోంది ? అంటే.. వీటికి స్పష్టమైన సమాధానాలు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది బ్యాంకు ఖాతాదారులు చనిపోయిన సందర్భాల్లో.. వారి ఖాతాల్లో డబ్బులు మిగిలిపోతున్నాయి. ఏళ్ల తరబడి.. ఎవరూ వచ్చి ఆ డబ్బులను తీసుకోవడం లేదు. దీంతో వడ్డీ, చక్రవడ్డీ కలిసి ఆ డబ్బులు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈవిధంగా బ్యాంకు ఖాతాల్లో క్లెయిమ్ చేసుకోకుండా మిగిలిపోయిన డబ్బులనే ‘అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు’ అంటారు. సదరు బ్యాంకు ఖాతాదారులకు సంబంధించిన నామినీల సమాచారం బ్యాంకుల వద్ద అందుబాటులో లేదు. దీనివల్ల నామినీలను బ్యాంకులు సంప్రదించలేక.. అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు ఆయా బ్యాంకు ఖాతాల్లోనే ఉండిపోతున్నాయి.
Also Read :Who is Ashok Elluswamy: ‘టెస్లా’కు దిక్సూచి అశోక్ ఎల్లుస్వామి.. ఆయన ఎవరు ?
ఖాతాదారుడికి ఏదైనా జరిగితే..
అందుకే ఇకపై నామినీల ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీలను సేకరించనున్నారు. భవిష్యత్తులోనూ బ్యాంకు ఖాతాదారుడికి ఏదైనా జరిగితే.. ఆ ఖాతాపై నామినీకి హక్కులను వర్తింపజేస్తారు. నామినీకి చెందిన ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీలకు దీనిపై అధికారిక సమాచారాన్ని పంపుతారు. బ్యాంకు ఖాతాదారుడి డెత్ సర్టిఫికెట్‌ను సమర్పించి, ఆ ఖాతాలోని డబ్బులను నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు.