Reliance Spinner: మన దేశంలో సమ్మర్ వచ్చిందంటే చాలు కూల్ డ్రింక్స్ పెద్దరేంజులో సేల్ అవుతుంటాయి. ఈవిభాగంలో ప్రస్తుతానికి విదేశీ కంపెనీలు పెప్సీ, కోకకోలా రాజ్యమేలుతున్నాయి. వీటికి పోటీనిచ్చేందుకు రిలయన్స్ పెద్దస్థాయిలోనే శ్రమిస్తోంది. ఇప్పటికే మార్కెట్‌లో రిలయన్స్‌కు చెందిన కాంపా కోలా అందుబాటులో ఉంది. తాజాగా ఒక స్పోర్ట్స్ డ్రింక్‌ను రిలయన్స్(Reliance Spinner) విడుదల చేసింది. దాని పేరే.. రిలయన్స్ స్పిన్నర్.
Also Read :Telangana BJP Chief: తెలంగాణ బీజేపీ చీఫ్ ఆయనే ? బీసీ నేతకు బిగ్ ఛాన్స్ ?
రిలయన్స్ స్పిన్నర్ గురించి..
- పేరుకు(స్పిన్నర్) తగ్గట్టుగానే ఈ స్పోర్ట్స్ డ్రింక్‌ను శ్రీలంకకు చెందిన ప్రఖ్యాత స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ చేతుల మీదుగా విడుదల చేయించారు.
- దీని బాటిల్ ధర కేవలం 10 రూపాయలు మాత్రమే.
- ఈ డ్రింక్‌కు ప్రచారం కల్పించేందుకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లతో చేతులు కలిపామని రిలయన్స్ రిటైల్ ప్రకటించింది.
- లెమన్, ఆరెంజ్, నైట్రో బ్లూ ఫ్లేవర్లలో ఈ డ్రింక్ లభిస్తుందని పేర్కొంది.
- ఫిట్‌నెస్ ఔత్సాహికుల కోసం ఈ డ్రింక్‌ను తీసుకొచ్చామని వెల్లడించింది.
- జిమ్, క్రీడల్లో పాల్గొనేటప్పుడు శరీరం నుంచి ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్‌ను కోల్పోతుంటారు. వాటిని తిరిగి శరీరానికి అందించేందుకు ‘స్పిన్నర్’ దోహదపడుతుందని రిలయన్స్ తెలిపింది.
Also Read :Mission South : ప్రధాని మోడీ ‘మిషన్ సౌత్’.. పవన్ ఏం చేయబోతున్నారు ?
ముత్తయ్య మురళీధరన్ ఏమన్నారు ?
ఒక క్రీడాకారుడిగా హైడ్రేషన్ విలువ తనకు తెలుసని ముత్తయ్య మురళీధరన్ అన్నారు. స్పోర్ట్స్ డ్రింక్ కేటగిరీలో స్పిన్నర్ మంచి స్థానాన్ని అందుకుంటుందని ఆయన చెప్పారు.
కూల్ డ్రింక్స్‌లో ఏముంటాయి ?
కూల్ డ్రింక్స్‌లో కెఫీన్, ఫాస్ఫారిక్ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి. కెఫిన్ వల్ల మన శరీరం క్యాల్షియంను శోషించుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఫాస్ఫారిక్ యాసిడ్ వల్ల రక్తంలో ఉండే క్యాల్షియం మూత్రం ద్వారా బయటకు పోతుంది. ఈ రెండు సమ్మేళనాలు చేటు చేస్తాయి. ఇవి రెండూ కూల్ డ్రింక్స్‌లో ఎక్కువగా ఉంటాయి. కనుక కూల్ డ్రింక్స్‌ను తాగితే శరీరానికి అసలు క్యాల్షియం లభించదు. ఫలితంగా ఎముకలు బలహీనంగా మారిపోతాయి. ఎముకలు విరిగిపోయే చాన్స్ ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు.