Real Money Gaming: డ్రీమ్11, మై11సర్కిల్, ఖేలో ఫాంటసీ లైవ్, ఎస్‌జీ11ఫాంటసీ, విన్‌జో, గేమ్స్24×7, జంగ్లీగేమ్స్ వంటి ‘ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్’ కంపెనీలు మనకు తెలుసు. చాలామంది వీటి ద్వారా మనీ గేమింగ్ ఆడుతుంటారు. ఈ కంపెనీలకు ఇక నుంచి ‘నైతిక ప్రవర్తనా నియమావళి’ అమల్లోకి రాబోతోంది. గేమింగ్‌లో నైతిక ప్రవర్తన, గేమర్ల వయస్సుకు సంబంధించిన నిబంధనల అమలు, కేవైసీ (నో యువర్ కస్టమర్) వివరాల నమోదును తప్పనిసరి చేయడం, ఒక్కో ఆటగాడు గేములపై పెట్టే ఖర్చుపై పరిమితిని విధించడం వంటివన్నీ ఇక నుంచి ఈ కంపెనీల ద్వారా అమలు చేయించనున్నారు. ఈ రూల్స్ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు అన్నింటికీ వర్తిస్తాయని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ప్రకటించింది.
Also Read :Pranay Murder Case : తెలుగు రాష్ట్రాల్లో చివరిసారిగా ఖైదీని ఎప్పుడు ఉరితీశారో తెలుసా ?
రూల్స్ అమలుకు గడువు
మన దేశంలో దాదాపు 50 కోట్ల మంది ఆన్‌లైన్ గేమర్లు ఉన్నారు. వీళ్ల ద్వారా గేమింగ్ కంపెనీలకు ఏటా భారీగా టర్నోవర్ వస్తుంటుంది. రూ.100 కోట్లకుపైగా వార్షిక టర్నోవర్ కలిగిన గేమింగ్ కంపెనీలు ‘నైతిక ప్రవర్తనా నియమావళి’ని 6 నెలల్లోగా అమల్లోకి తేవాలి. రూ.100 కోట్లలోపు వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలు 9 నెలల్లోగా వాటిని అమల్లోకి తేవాలి. అనైతిక విధానాలతో కొన్ని గేమింగ్ కంపెనీలు పరిశ్రమకు, ఆటగాళ్లకు నష్టం చేకూరుస్తున్నాయి. ఇలాంటి ధోరణులను అరికట్టే లక్ష్యంతోనే ఒకే వేదికపైకి వచ్చామని ఇ-గేమింగ్ ఫెడరేషన్ సీఈఓ అనురాగ్ సక్సేనా తెలిపారు.
Also Read :KA Paul : జనసేన పార్టీ పై కేఏ పాల్ సంచలన కామెంట్స్
ఆన్‌లైన్ గేమ్స్.. డేంజర్ బెల్స్
ఆన్‌లైన్ గేమ్స్ మన దేశంలోని బాలలు, యువతను వాటికి బానిసల్లా మార్చుకుంటున్నాయి. ఈ వ్యసనంతో పిల్లలు, యువత చదువులపై ఫోకస్ చేయలేకపోతున్నారు. కొందరు యువత ఆన్‌లైన్ గేమ్స్‌లో(Real Money Gaming) పందెం కాసి భారీగా నష్టపోతున్నారు. తమ తల్లిదండ్రుల కష్టార్జితాన్ని క్షణాల్లో ఆవిరి చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్న నిఖిల్ రావు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసయ్యాడు. భారీగా అప్పులు చేసి మరీ ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడాడు. ఈ అప్పులను తల్లిదండ్రులు తీర్చారు. అయినా నిఖిల్ రావు ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనం నుంచి బయట పడలేదు. ఆన్‌లైన్‌లో అప్పులు చేసి మరీ గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు. రెండు రోజుల క్రితం కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు బస్సులో బయలుదేరిన నిఖిల్.. తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ వద్ద దిగాడు. అక్కడ ఒక వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.