Rooh Afza Vs Patanjali : ‘షర్బత్ జిహాద్’ అంటూ ఇటీవలే యోగా గురువు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం క్రియేట్ చేశాయి. హమ్దర్ద్ కంపెనీకి చెందిన రూహ్ అఫ్జా షర్బత్‌ను ఉద్దేశించి పరోక్షంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. తమ పతంజలి కంపెనీ సైతం గులాబ్ షర్బత్, మ్యాంగో పన్నా, బేల్ షర్బత్, బ్రాహ్మి షర్బత్, ఖాస్ షర్బత్, థండై పౌడర్ పేర్లతో షర్బత్‌లను తీసుకొచ్చిందని రాందేవ్ గుర్తు చేశారు. ‘‘రూహ్ అఫ్జా లాంటి షర్బత్‌లను తాగితే మసీదులు, మదర్సాలను కడతారు. పతంజలి షర్బత్‌లు(Rooh Afza Vs Patanjali) తాగితే మందిరాలు, వేద పాఠశాలలను కడతాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతకీ షర్బత్ వ్యాపారంలో హమ్దర్ద్ రూహ్ అఫ్జా పెద్దదా ? పతంజలి షర్బత్ పెద్దదా ? చూద్దాం.
Also Read :Ambedkar Jayanti : ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి.. బాల్యం నుంచి భారతరత్న దాకా కీలక ఘట్టాలివీ
హమ్దర్ద్, పతంజలి వ్యాపారం ఎంత?
హమ్దర్ద్ లేబొరేటరీస్ కేవలం రూహ్ అఫ్జా షర్బత్ తయారీకి పరిమితం కాలేదు. అది సింకర, రోగన్ బాబాద్ షిరీన్, సాఫీ, జోషినా, స్వాలిన్ వంటి అనేక షర్బత్‌లను తయారు చేస్తోంది. 2016లో రూహ్ అఫ్జా దాదాపు రూ.600 కోట్ల వ్యాపారం చేసింది. 2018 నాటికి హమ్దర్ద్ లేబొరేటరీస్ రూ.1000 కోట్ల అమ్మకాల లక్ష్యాన్ని పెట్టుకుందట. ఇక పతంజలి కంపెనీ మొత్తంగా అన్ని విభాగాలను కలుపుకొని 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.9,335.32 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. దాని వ్యాపారంలో దాదాపు 23.15 శాతం వృద్ధి నమోదైంది. పతంజలి కంపెనీ షర్బత్‌లు, పానీయాలకు ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. ఇక ఇదే సమయంలో రూహ్ అఫ్జా షర్బత్ కూడా మంచిసేల్స్‌ను సాధిస్తోంది.
Also Read :Jana Reddy Vs Rajagopal Reddy: జానాపై రాజగోపాల్ ఫైర్.. ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది ?
119 ఏళ్ల నాటి రూహ్ అఫ్జా కథ
రూహ్ అఫ్జా అంటే ఆత్మను తాజాగా ఉంచేది అని అర్థం. ఈ గొప్ప షర్బత్ ప్రస్థానం భారతదేశ స్వాతంత్య్రం కంటే ముందే ప్రారంభమైంది. 1907లో యునాని హెర్బల్ మెడిసిన్, హమ్దర్ద్ దవాఖానా వ్యవస్థాపకుడు హకీమ్ హాఫీజ్ అబ్దుల్ మజీద్ ఈ షర్బత్‌ను తయారు చేశారు. వేసవిలో డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్‌కు గురయ్యే వారి కోసం ఈ ప్రత్యేక ఔషధాన్ని తయారు చేశారు. పండ్లు, మూలికలు, పూల సారంతో ఈ మిశ్రమాన్ని తయారు చేశారు.