QR Coin Machine : చిల్లర నాణేలు దొరకక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం ఒక పరిష్కార మార్గం రెడీ అయింది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే.. మనకు అవసరమైనంత మేర చిల్లర కాయిన్స్‌ను అందించే వెండింగ్ మెషీన్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని కేరళలోని కోజీకోడ్‌లో ఉన్న పుతియారా ఏరియాలో ఫెడరల్ బ్యాంకు ఏర్పాటు చేసింది. ఈ మెషీన్ అచ్చం ఏటీఎంలాగే ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Raj Pakala : కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ.. పోలీసుల రైడ్స్
కాయిన్ వెండింగ్ మెషీన్ ఇలా పనిచేస్తుంది
- ఫెడరల్ బ్యాంకు ఏర్పాటు చేసిన కాయిన్ వెండింగ్ మెషీన్ చూడటానికి ఏటీఎంలా ఉంటుంది.
- ఇందులో స్క్రీన్‌పై ఒక క్యూఆర్ కోడ్(QR Coin Machine) ఉంటుంది.
- మన స్మార్ట్‌ఫోనులో ఉన్న ఏదైనా ఒక డిజిటల్ పేమెంట్ యాప్‌ను తెరిచి, ఈ మెషీన్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.
- పేమెంట్ పూర్తయిన తర్వాత మన యూపీఐ అకౌంటు నుంచి డబ్బు .. కాయిన్ వెండింగ్ మెషీన్‌కు బదిలీ అవుతుంది.
- Google Pay, PhonePe, Paytm వంటి ఏదైనా డిజిటల్ చెల్లింపు యాప్‌ను ఈ మెషీన్ వద్ద స్కానింగ్ చేయడానికి వాడొచ్చు.
- ఈ మెషీన్‌లో 1, 2, 5, 10 రూపాయల నాణేలు ఉంటాయి.
- స్క్రీన్‌పై మనకు ఈ నాణేల ఆప్షన్స్ కనిపిస్తాయి. ఏయే నాణేలు ఎన్నెన్ని కావాలి అనేది ఎంటర్ చేయాలి.
- గతంలోనూ ఇలాంటి కాయిన్ వెండింగ్ మెషీన్లు ఉన్నప్పటికీ.. వాటిలో మనం నోట్లను వేసి నాణేలను తీసుకోవాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం ఉండదు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్‌తో పేమెంట్ చేసి మనకు అవసరమైనన్ని కాయిన్స్ ఈజీగా పొందొచ్చు.
- క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్లను దేశవ్యాప్తంగా ఇన్‌స్టాల్ చేయాలని 2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయించింది.