ఇటీవలి కాలంలో బంగారం ధరలు (Gold Price) నిరంతరం పెరుగుతూ పసిడి ప్రియులను ఆందోళనకు గురి చేశాయి. అయితే ప్రస్తుతం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. నిన్నటి (మంగళవారం)తో పోల్చితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,000గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.93,152గా ఉంది. వెండి విషయానికి వస్తే కేజీ వెండి ధర రూ.1,16,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఈ తగ్గుదల బంగారం కొనుగోలు చేసేందుకు ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశంగా మారింది.
Nidigunta Aruna : పోలీసుల అదుపులో నిడిగుంట అరుణ
అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ అస్థిరతలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా రాజకీయ పరిణామాలు, టారిఫ్ యుద్ధాలు, డాలర్ విలువ తగ్గడం వంటివి బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తిని మరింత పెంచాయి. దేశీయంగా శ్రావణమాసం ముగిసి భాద్రపద మాసం ప్రారంభమైనా, వివాహ సీజన్ కొనసాగుతుండడంతో బంగారం డిమాండ్ మరింత పెరిగింది. పదేళ్లలో బంగారం పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు రావడంతో ఇన్వెస్టర్లు దీనిని అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు.
CM Revanth Bhadrachalam Tour : సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి పర్యటన వాయిదా
మొత్తంగా కొద్ది రోజుల క్రితం బంగారం రూ.1,04,000 వద్ద ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేయగా, ప్రస్తుతం దానికంటే రూ.2,000 తగ్గుదల కనిపిస్తోంది. వెండి కూడా ఇటీవల గరిష్ట స్థాయితో పోల్చితే రూ.10,000 వరకు తగ్గింది. అయినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలోని మార్పులు, దేశీయ డిమాండ్, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాల దృష్ట్యా భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు మరింత హెచ్చుతగ్గులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పసిడి ప్రియులు కొనుగోలు చేయడానికి ఇదొక అనుకూల సమయమని కూడా సూచిస్తున్నారు.