Gold ATM : గోల్డ్ ఏటీఎం వచ్చేసింది.. ఫీచర్లు ఇవీ

మనం తొలుత బంగారు ఆభరణాలను ఈ గోల్డ్ ఏటీఎంలో(Gold ATM) వేసి, బ్యాంకు ఖాతా వివరాలను ఎంటర్ చేయాలి.

Published By: HashtagU Telugu Desk
Gold Atm China Gold For Cash Physical Gold Digital Cash

Gold ATM : చైనానా మజాకా. అది తలచుకుంటే దేన్నైనా తయారు చేయగలదు. గోల్డ్ ఏటీఎంను కూడా!! ఔను.. గోల్డ్ ఏటీఎంను చైనా తయారు చేసింది. చైనాలోని షెంజెన్ ప్రాంతానికి చెందిన కింగ్ హుడ్ గ్రూప్ గోల్డ్ ఏటీఎంను తయారు చేసింది. బంగారం ధరలు చుక్కలను అంటుతున్న ప్రస్తుత తరుణంలో అందరూ ఈ గోల్డ్ ఏటీఎం గురించి తెలుసుకునేందుకు ఆసక్తిని చూపుతున్నారు.  ప్రయోగాత్మకంగా ఒక గోల్డ్ ఏటీఎంను షాంఘై నగరంలోని గ్లోబల్ హార్బర్ షాపింగ్ మాల్‌లో ఏర్పాటు చేశారు. దీని గురించి తెలియగానే ఎంతోమంది చైనా జనం క్యూ కట్టారట. తమ దగ్గరున్న పాత తరం బంగారు ఆభరణాలను ఈ ఏటీఎంలో వేసి డబ్బులు తీసుకున్నారట. ఇంతకీ ఇదెలా పనిచేస్తుంది ? దీనిలో ఏమేం ఫీచర్లు ఉన్నాయి ? చూద్దాం..

గోల్డ్ ఏటీఎం ఎలా పనిచేస్తుంది ? 

  • మనం తొలుత బంగారు ఆభరణాలను ఈ గోల్డ్ ఏటీఎంలో(Gold ATM) వేసి, బ్యాంకు ఖాతా వివరాలను ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత మన బంగారు ఆభరణాలను ఈ ఏటీఎం తూకం వేస్తుంది. అవి ఒరిజినలా కాదా అనేది నిర్ధారిస్తుంది.
  • మనకు ఎంత అమౌంటు చేతికొస్తుందనే సమాచారాన్ని డిస్‌ప్లే చేస్తుంది. దాన్ని చూసి.. మనం ఓకే అని ఎంటర్ చేయాలి.
  • తదుపరిగా ఆ ఆభరణాలను గోల్డ్ ఏటీఎం కరిగిస్తుంది.
  • బంగారాన్ని కరిగించడం పూర్తయ్యాక.. మన బ్యాంకు ఖాతాలోకి డబ్బులు బదిలీ అవుతాయి.
  • షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రమాణాల ప్రకారం బంగారం ధరను ఈ ఏటీఎం అందిస్తుంది.
  • 1,200 డిగ్రీల సెల్సీయస్ టెంపరేచర్‌లో ఈ ఏటీఎం బంగారాన్ని కరిగిస్తుంది.
  • ఈ ఏటీఎంలోని సెన్సర్లు బంగారం నాణ్యతను పరీక్షిస్తాయి.
  • ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్ల అవసరం లేదు.
  • ఈ గోల్డ్ ఏటీఎం కనీసం 50 శాతం స్వచ్ఛతతో.. 3 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న బంగారు ముక్కలను మాత్రమే స్వీకరిస్తుంది.

Also Read :Bhoodan Land Scam: భూదాన్‌ భూములతో ‘రియల్’ దందా.. పాతబస్తీలో ఈడీ రైడ్స్

కస్టమర్ ఫీడ్ బ్యాక్.. 

ఆంట్ వాంగ్ అనే చైనా మహిళ ఈ గోల్డ్ ఏటీఎంలో 40 గ్రాముల గోల్డ్ నెక్లెస్ వేసింది. దాన్ని తూకం వేసిన ఏటీఎం.. ఆమె బ్యాంకు ఖాతాకు 30 నిమిషాల్లోనే రూ.4.20 లక్షలను బదిలీ చేసింది. ఒక గ్రాము బంగారానికి రూ.9,170 చొప్పున రీసైక్లింగ్ రేటుతో  ఈ మొత్తాన్ని గోల్డ్ ఏటీఎం అందించింది.

  Last Updated: 28 Apr 2025, 01:06 PM IST