Site icon HashtagU Telugu

Elon Musk : ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితా..మళ్లీ అగ్రస్థానంలో ఎలాన్‌ మస్క్‌

Forbes Rich List: Elon Musk tops list again

Forbes Rich List: Elon Musk tops list again

Elon Musk : ఫోర్బ్స్‌ సంస్థ 2025 సంపన్నుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో మరోసారి ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్‌ తొలిస్థానంలో నిలిచారు. 342 బిలియన్‌ డాలర్ల నికర విలువతో ఆయన అగ్రస్థానం దక్కించుకున్నారు. గతేడాదితో పోలిస్తే మస్క్‌ సంపద 147 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ప్రపంచ కుబేరుడు మస్క్‌కు టెస్లా, స్పేస్‌ఎక్స్‌, ఎక్స్‌ వంటి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం యూఎస్‌ 902 మంది సంపన్నులతో బిలియనీర్‌ హబ్‌గా కొనసాగుతోంది. చైనాలో 516 మంది బిలియనీర్లు ఉండగా.. భారత్‌లో 205మంది ఉన్నారు.

Read Also: Maoists : కేంద్రంతో శాంతిచర్చలకు సిద్ధమని మావోయిస్టుల ప్రకటన

ప్రముఖ భారత వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ 92.5 బిలియన్‌ డాలర్ల సంపదతో ఈ జాబితాలో 18వ స్థానంలో నిలిచారు. మరో భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ 56.3 బిలియన్‌ డాలర్ల సంపదతో 28వ స్థానంలో ఉన్నారు. ఆసియాలో అత్యంత ధనవంతుడైన నాలుగో వ్యక్తి, దేశంలో అత్యంత ధనవంతుడైన రెండో వ్యక్తిగా నిలిచారు. చైనాకు చెందిన జాంగ్ యిమింగ్ 65.5 బిలియన్‌ డాలర్లతో ఈ జాబితాలోని బిలియనీర్లలో 23వ స్థానం దక్కించుకోగా అదే దేశానికి చెందిన జాంగ్ షాన్షాన్ 57.7 బిలియన్‌ డాలర్లతో 26వ స్థానంలో ఉన్నారు.

ఇకపోతే..ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ఈసారి 288 మంది కొత్త వ్యక్తులను చేరారు. వీరిలో రాక్ స్టార్ బ్రూస్ స్ప్రింగ్స్టీన్ (1.2 బిలియన్ డాలర్లు), బాలీవుడ్‌ సినీ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ (1.1 బిలియన్ డాలర్లు) హాస్యనటుడు జెర్రీ సీన్ఫెల్డ్ (1.1 బిలియన్ డాలర్ల) ఉన్నారు. హెడ్జ్ ఫండ్ లెజెండ్ జిమ్ సైమన్స్ భార్య మార్లిన్ సైమన్స్ (31 బిలియన్ డాలర్లు) వీరిలో అందరికంటే సంపన్నమైన వ్యక్తిగా నిలిచారు. గతేడాది మే నెలలో ఆయన మరణించారు.

Read Also: Waqf Amendment Bill : లోక్‌సభ ముందుకు వక్ఫ్‌ బిల్లు