Ambanis Mango Empire: ముకేశ్ అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఈ పేర్లు వినగానే మనకు పెద్దపెద్ద ఇండస్ట్రీలు గుర్తుకు వస్తాయి. కానీ తోటలు గుర్తుకు రావు. మామిడి పండ్లయితే అస్సలు గుర్తుకు రావు. వాస్తవానికి మామిడి పండ్లతోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు, ముకేశ్ అంబానీకి లింకులు ఉన్నాయి. ఇంతకీ ఎలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Alcohol Effect : వైసీపీ ఏలుబడిలో నాణ్యతలేని మద్యం.. 100 శాతం పెరిగిన కాలేయ వ్యాధులు !
600 ఎకరాల బీడు భూముల్లో..
గుజరాత్‌లోని జామ్‌నగర్ అనగానే మనకు అక్కడున్న రిలయన్స్ చమురు శుద్ధి కర్మాగారం గుర్తుకు వస్తుంది. 1997 సంవత్సరం నాటికి ఈ కర్మాగారం వల్ల కాలుష్యం బాగా పెరిగింది. దీంతో కాలుష్యాన్ని తగ్గించేందుకు రిలయన్స్ యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. చమురు శుద్ధి కర్మాగారం చుట్టూ ఉన్న బీడు భూముల్లో మామిడి తోటలను పెంచాలని కంపెనీ నిర్ణయించింది. దాదాపు 600 ఎకరాల బీడు భూముల్లో మామిడి మొక్కలను నాటించింది. ఆ మామిడి తోటకు.. ‘ధీరూభాయ్ అంబానీ లఖీబాగ్ అమ్రాయీ’(Ambanis Mango Empire) అనే పేరు పెట్టారు.
Also Read :Ceasefire Inside Story: పాక్ అణు స్థావరాలపై దాడికి సిద్ధమైన భారత్.. అందుకే సీజ్‌ఫైర్‌కు అంగీకారం
దాదాపు 1.30 లక్షలకుపైగా మామిడి చెట్లు..
కట్ చేస్తే.. ఇప్పుడు అక్కడ 600 ఎకరాల్లో దాదాపు 1.30 లక్షలకుపైగా మామిడి చెట్లు ఉన్నాయి. దాదాపు 200 రకాల మామిడిపండ్ల వెరైటీలు ఈ తోటలో పండుతాయి. కేసర్, ఆల్ఫోన్సో, రత్న, సింధు, నీలమ్, ఆమ్రపాలి, టామీ అట్కిన్స్, కెంట్, లిలీ, మాయా రకాల మామిడి పండ్లు ఇందులో లభిస్తాయి. ఏటా 600 టన్నుల మామిడి దిగుబడి వస్తోంది. ఆ పండ్లను ఆన్‌లైన్‌తోపాటు తమ స్టోర్ల ద్వారా దేశ, విదేశాలకు రిలయన్స్ ఎగుమతి చేస్తోంది. ఏటా రూ.100 కోట్ల దాకా టర్నోవర్‌ను సాధిస్తోంది. జామ్‌నగర్‌లోని ఒకప్పటి 600 ఎకరాల బీడు భూమి.. ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద మామిడితోటగా రికార్డును క్రియేట్ చేసింది. ఈ తోటలో 500 మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. డీశాలినేషన్, డ్రిప్ ఇరిగేషన్, ఫెర్టిగేషన్, వాటర్ హార్వెస్టింగ్ వంటి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని ఈ తోటలో అవలంబిస్తారు. రిలయన్స్ సంస్థ ఏటా ఈ తోట నుంచి దాదాపు లక్ష మామిడి మొక్కల్ని స్థానిక రైతులకు పంచిపెడుతుంటుంది. ఆధునిక వ్యవసాయపద్ధతుల్లో శిక్షణ ఇస్తూ వాళ్లకూ ఆదాయమార్గాలను చూపుతోంది.