Sebi Chief Received Crores : సెబీ చీఫ్ మాధవి పురీ బుచ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సెబీ ఛైర్‌పర్సన్ హోదాను దుర్వినియోగం చేసి తన అడ్వైజరీ కంపెనీ ‘అగోరా ప్రైవేట్ లిమిటెడ్’కు వివిధ కంపెనీల నుంచి ఆర్థిక లబ్ధి జరిగేలా మాధవి పురీ చేసుకున్నారని ఆయన తెలిపారు. మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, పిడిలైట్, ఐసీఐసీఐ, విసు లీజింగ్ అండ్ ఫైనాన్స్, సెంబ్‌కార్ప్ వంటి కంపెనీల నుంచి ‘అగోరా ప్రైవేట్ లిమిటెడ్’ ఆర్థిక ప్రయోజనం పొందిందన్నారు.
Also Read :5000 Cyber Commandos: సైబర్ క్రైమ్స్ కట్టడికి 5వేల సైబర్ కమాండోలు : హోంమంత్రి అమిత్‌షా
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ నుంచి సెబీ చీఫ్‌కు చెందిన ‘అగోరా ప్రైవేట్ లిమిటెడ్’కు రూ.2.59 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ నుంచి మాధవి భర్త దావల్ రూ.4.78కోట్ల ఆదాయం పొందారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మాధవి సెబీ బోర్డులో పూర్తిస్థాయి సభ్యురాలుగా ఉన్న టైంలోనే ఆమె భర్త ఈ ఆదాయాన్ని పొందారని తెలిపింది. ఈవిధంగా సెబీ చీఫ్(Sebi Chief Received Crores) హోదాలో ఉన్నవారు అక్రమ ప్రయోజనాలను పొందడం అనేది సెబీ నిబంధనల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా చెప్పారు.
Also Read :Sitaram Yechury Condition Critical : సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం
కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై మహీంద్రా గ్రూప్ స్పందించింది. మాధవి పురీ బుచ్ సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులు కావడానికి మూడేళ్లు ముందే ఆమె భర్త ధావల్ తమ కంపెనీలో చేరారని తెలిపింది. ప్రస్తుతం ఆయన తమ అనుబంధ కంపెనీ బ్రిస్టిల్‌కోన్‌లో బోర్డు సభ్యులుగా ఉన్నారని చెప్పింది. సప్లై చైన్ విభాగంలో మాధవి పురీ బుచ్ భర్త ధావల్‌కు మంచి అనుభవం ఉందని..దాని ఆధారంగానే ఆయనకు శాలరీ చెల్లిస్తున్నామని మహీంద్రా గ్రూప్ స్పష్టం చేసింది. తమ కంపెనీని ప్రత్యేకంగా పరిగణించమని సెబీ చీఫ్ మాధవి పురీ బుచ్‌ను ఎన్నడూ కోరలేదని తేల్చి చెప్పింది. తమ సంస్థకు 2018 మార్చిలోనే సెబీ నుంచి ఓ అప్రూవల్ వచ్చిందని గుర్తు చేసింది. ఆ సమయానికి సెబీ చీఫ్ మాధవి భర్త ధావల్ ఇంకా మహీంద్రా గ్రూప్‌లో చేరలేదని తెలిపింది.