Buying Property : రియల్ ఎస్టేట్ బూమ్ నడుస్తున్న కాలం ఇది. నిత్యం ఎంతోమంది ఫ్లాట్, ప్లాట్ కొంటూ ఉంటారు. ఎందుకంటే.. స్థిరాస్తి చాలా సేఫ్ పెట్టుబడి. దీర్ఘకాలంలో అద్భుతమైన లాభాలను మనకు అందిస్తుంది. అందుకే ఇకపైనా చాలామంది ఫ్లాట్లు, ప్లాట్లను తప్పకుండా కొంటారు. అలాంటి వారి కోసమే ఈ కథనం. ఫ్లాట్ లేదా ప్లాట్‌ను(Buying Property) కొనే క్రమంలో ఏయే డాక్యుమెంట్లను తప్పకుండా తనిఖీ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- ఎవరి నుంచైనా ప్రాపర్టీ కొనేటప్పుడు మొదట మనం అడగాల్సింది టైటిల్ డీడ్. ఇది ఉన్నవాళ్లదే ఆస్తి అని మనం అర్థం చేసుకోవాలి. టైటిల్ డీడ్ ఉన్నవాళ్లు మాత్రమే ఆ ఆస్తిని ఇతరులకు బదిలీ చేయగలుగుతారు.
- ఆస్తి చరిత్ర గురించి, దాని మూలాల గురించి తెలుసుకోవాలంటే మదర్ డీడ్ తప్పకుండా ఉండాలి. ఈ డీడ్ ఉంటే ఆస్తి పాత యజమాని నుంచి ప్రస్తుత యజమాని వరకు అందరి వివరాలను మనం తెలుసుకోవచ్చు.
Also Read :Mumbai Blasts : ఉగ్రవాది తహవూర్‌కు షాక్.. భారత్‌కు అప్పగించవచ్చన్న అమెరికా కోర్టు
- ఆస్తితో ముడిపడిన ఆర్థిక లావాదేవీల చిట్టాను ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ అని పిలుస్తాం. ఏదైనా ఆస్తిపై ఎవరికైనా తాత్కాలిక హక్కులు ఉంటే ఈ సర్టిఫికెట్‌లో వివరాలు ఉంటాయి. ఆ ఆస్తిని ఎక్కడైనా తనఖాపెట్టి లోన్లు తీసుకున్నారా ? లేదా ? అనే సమాచారం కూడా ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌లోనే ఉంటుంది. ఆ ఆస్తిపై ఏవైనా కోర్టు కేసులు ఉన్నా.. ఆ వివరాలు కూడా దీనిలోనే ఉంటాయి. అందుకే ఈ సర్టిఫికెట్‌ను తప్పకుండా చెక్ చేయాలి.
- ఏదైనా స్థిరాస్తిని కొనేటప్పుడు విక్రేత నుంచి తప్పకుండా ప్రాపర్టీ ట్యాక్స్ రసీదులు అడగండి. అవి చాలా ముఖ్యమైనవి. ఆ ఆస్తికి సంబంధించిన ట్యాక్సులను ఎంతమేర చెల్లించారు ?ఏమైనా బకాయిలు ఉన్నాయా ? అనే సమాచారం ఈ రసీదులలో ఉంటుంది. ఒకవేళ ఆస్తిపై ఏమైనా బకాయిలు ఉంటే ముందు వాటిని పే చేయమని విక్రేతకు సూచించాలి. ఆ తర్వాతే మనం కొనాలి.
- ఎక్కడైనా అపార్ట్‌మెంట్ కట్టాలంటే ప్రత్యేక అనుమతులను తీసుకోవాలి. దీని కోసం అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్ కావాలి. దీని కోసం స్థానిక సంస్థ (గ్రామ పంచాయతీ/నగరపాలిక/పురపాలిక) నుంచి అనుమతి తీసుకోవాలి. మీరు ఏదైనా అపార్ట్‌మెంటును లేదా అపార్ట్‌మెంటులోని ప్లాట్‌ను కొనాలంటే తప్పకుండా దానికి అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్ ఉందో లేదో చెక్ చేయాలి. ఈ అనుమతి లేని ఆస్తి కొంటే ఇబ్బందులు ఎదురవుతాయి.
- ఏదైనా అపార్ట్‌మెంటును నిర్మిస్తే తప్పకుండా వెంటనే స్థానిక సంస్థ నుంచి కంప్లీషన్ సర్టిఫికెట్‌ను పొందాలి. అప్రూవల్ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణం జరిగితేనే ఈ సర్టిఫికెట్ లభిస్తుంది.
- ఏదైనా భవనం లేదా ఇల్లును నిర్దేశించిన స్థలంలోనే నిర్మిస్తే స్థానిక సంస్థ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లభిస్తుంది.
- ఏదైనా ఇల్లు లేదా అపార్ట్‌మెంటుకు సంబంధించి సంబంధిత సొసైటీ లేదా బిల్డర్ తప్పకుండా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు (ఎన్ఓసీ) తీసుకోవాలి.
- కొందరు వ్యక్తులకు ఆస్తిపై పవర్ ఆఫ్ అటార్నీ లభిస్తుంది. అలాంటి వాళ్ల నుంచి ఆస్తి కొనే క్రమంలో జాగ్రత్త వహించాలి. ఆ పవర్ ఆఫ్ అటార్నీ పత్రం నిజమైనదేనా ? అది ఇంకా చెల్లుతుందా ? అనేది నిర్ధారించుకోవాలి.
- ఆస్తికి చట్టపరమైన యాజమాన్యాన్ని కల్పించే పత్రాన్ని పట్టా అంటారు. ఆస్తి సరిహద్దులు, యాజమాన్య సమాచారం, పన్ను మదింపు వంటి వివరాలను కలిగి ఉన్న రికార్డును చిట్టా అంటారు.
- కొంతమంది ఆస్తిని లేదా భూమిని బ్యాంకులో తనఖా పెట్టి లోన్స్ తీసుకుంటారు. ఒకవేళ లోన్ మొత్తం కట్టేస్తే తప్పకుండా ఆ బ్యాంక నుంచి లోన్ రిలీవింగ్ లెటర్ పొందాలి. లేదంటే విక్రయించే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతాయి.