Bitcoin Record High : బిట్‌కాయిన్ ధర మరోసారి రికార్డు స్థాయికి పెరిగింది. ఇవాళ క్రిప్టో కరెన్సీ మార్కెట్లు ప్రారంభం కాగానే దాని ధర ఏకంగా రూ.89 లక్షలు (1.05 లక్షల డాలర్లకు) చేరింది. ఈనెలా చివరికల్లా బిట్ కాయిన్ ధర రూ.93 లక్షలకు (1.10 లక్షల డాలర్లు) చేరుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే క్రిప్టో కరెన్సీ(Bitcoin Record High) మార్కెట్‌కు ప్రోత్సాహకాలు ప్రకటిస్తానని ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ క్రిప్టో మార్కెట్‌ను గత కొన్ని వారాలుగా దౌడు తీయిస్తున్నాయి.
Also Read :Winter Tour : డిసెంబర్‌లో హిమపాతాన్ని ఆస్వాదించడానికి ఈ 3 హిల్ స్టేషన్‌లకు ట్రిప్ ప్లాన్ చేయండి..!
జనవరి 20న అమెరికా ప్రెసిడెంట్‌గా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం భారీ అప్పుల్లో ఉంది. వాటిపై ఏటా పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించే చర్యల్లో భాగంగా బిట్‌కాయిన్‌ను అమెరికా ప్రభుత్వ వ్యూహాత్మక రిజర్వు నిధిగా ట్రంప్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ట్రంప్ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించనున్న అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఇదే కోణంలో ట్రంప్‌కు సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల ప్రచారంలోనూ క్రిప్టో కరెన్సీ గురించి ఇదే అంశాన్ని ఎలాన్ మస్క్ బాహాటంగా చెప్పేశారు. క్రిప్టో మార్కెట్‌లో ఎలాన్ మస్క్‌కు భారీ పెట్టుబడులు ఉన్నాయి.
Also Read :Sweat : ఎక్కువ చెమట పట్టడం వల్ల కేలరీలు వేగంగా కరిగిపోతాయా..?
పెట్టుబడి రూ.2,200 కోట్లు.. ప్రస్తుత వ్యాల్యూ రూ.5వేల కోట్లు : ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు
సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వడార్ దేశం బిట్‌కాయిన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టింది. తమ దేశం ఇప్పటివరకు బిట్‌కాయిన్‌లో పెట్టిన పెట్టుబడుల విలువ దాదాపు రూ.5వేల కోట్లు దాటిందని ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకీల్ ప్రకటించారు. బిట్ కాయిన్ ధర పెరగడంతో తమ పెట్టుబడుల విలువకు రెక్కలు వచ్చాయని ఆయన చెప్పారు. వాస్తవానికి తాము బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేసింది కేవలం రూ.2,200 కోట్లు మాత్రమేనని ఆయన తెలిపారు. ఇదేవిధంగా చాలా దేశాలు బిట్ కాయిన్‌లో పెట్టుబడుల దిశగా ఆసక్తి చూపుతున్నాయి. త్వరలో అమెరికా కూడా ఈ జాబితాలో చేరబోతోంది. ఈ పరిణామం ఎటువైపుగా వెళ్తుందో వేచిచూడాలి.