మార్చి 31తో ఆర్థిక సంవత్సరము ముగుస్తుండగా.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బ్యాంకులలో ఖాతా ముగింపు, ఆర్థిక లావాదేవీల నిర్వహణ వంటి కార్యక్రమాల కారణంగా ఏప్రిల్ 1, 2025న బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటన మేరకు ఆ రోజు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు.
KTR : నల్గొండ జిల్లాలో కేటీఆర్‌పై రెండు కేసులు.. ఎందుకంటే.. ?
ఇది మాత్రమే కాకుండా ఏప్రిల్ నెలలో మొత్తం 10 రోజులు బ్యాంకులకు సెలవులు (Bank Holidays) ఉన్నాయి. వీటిలో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు సహా శ్రీరామ నవమి, అంబేద్కర్ జయంతి, గుడ్ ఫ్రైడే వంటి ముఖ్యమైన పండుగలు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన రోజులు ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 12 నుంచి 14 వరకు అంబేద్కర్ జయంతి కారణంగా వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
OYO Room : ఓయో రూమ్ కోసం ‘ఆధార్’ ఇస్తున్నారా ? ఇది తెలుసుకోండి
ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునే ప్రజలు ముందస్తుగా తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం మంచిది. నగదు డిపాజిట్, ఉపసంహరణలు, చెక్ క్లియరెన్స్ వంటి కార్యకలాపాలను బ్యాంక్ పనిచేసే రోజుల్లో పూర్తి చేసుకోవాలి. ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ లాంటి డిజిటల్ లావాదేవీలు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రజలు ఏప్రిల్ నెలలో బ్యాంక్ సెలవుల వివరాలను ముందుగా తెలుసుకొని తమ పనులను సజావుగా నిర్వహించుకోవాలి.
ఏప్రిల్‌లో బ్యాంకులకు సెలవులు ఇవే..( Bank Holidays For April 2025 )
ఏప్రిల్ 06 – శ్రీరామనవమి
ఏప్రిల్ 10 – మహావీర్ జయంతి
ఏప్రిల్ 12 – రెండో శనివారం
ఏప్రిల్ 13 – ఆదివారం
ఏప్రిల్ 14 – డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 18 – గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 20 – ఆదివారం
ఏప్రిల్ 26 – నాలుగో శనివారం
ఏప్రిల్ 27 – ఆదివారం