New Income Tax Bill: ‘నూతన ఆదాయపు పన్ను బిల్లు-2025’ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఈ బిల్లును పరిశీలన కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపుతారు. ఇంతకీ ఈ బిల్లులో ఏమేం ఉన్నాయా ? పాత ఆదాయపు పన్ను చట్టంతో పోలిస్తే దీనిలో జరిగిన కీలక మార్పులు ఏమిటి ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Personal Finance Changes: మీపై వ్యక్తిగతంగా ప్రభావం చూపే.. కేంద్ర బడ్జెట్‌లోని పన్ను మార్పులివే
‘నూతన ఆదాయపు పన్ను బిల్లు’లో ఏమున్నాయి ?
- ఆరు దశాబ్దాల క్రితం మన దేశంలో ‘ఆదాయపు పన్ను చట్టం-1961’(New Income Tax Bill) అమల్లోకి వచ్చింది.
- త్వరలోనే దాని స్థానంలో నూతన ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకురానున్నారు.
- నూతన ఆదాయపు పన్ను బిల్లులో 536 సెక్షన్లు ఉంటాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఐటీ చట్టంలో సెక్షన్ల సంఖ్య 298 మాత్రమే.
- ప్రస్తుత చట్టంలో 14 షెడ్యూళ్లు ఉండగా, నూతన బిల్లులో 16 షెడ్యూళ్లు ఉంటాయి.
- పాత, నూతన ఆదాయపు పన్ను చట్టాల్లోని ఛాప్టర్ల సంఖ్యలో ఎలాంటి మార్పూ లేదు. వాటి సంఖ్య 23.
Also Read :Shubman Gill: ఇంగ్లాండ్‌తో మూడో వన్డే.. సెంచరీ సాధించిన గిల్, చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- నూతన ఆదాయపు పన్ను బిల్లులో పేజీల సంఖ్యను తగ్గించి 622 చేశారు. 1961లో ఆదాయపు పన్ను చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పుడు, పేజీల సంఖ్య 880.
- ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంలో ఉన్న ‘గత ఏడాది’ (ప్రీవియస్ ఈయర్) అనే పదాన్ని ‘పన్ను సంవత్సరం’ (ట్యాక్స్ ఈయర్) అనే పదంతో రీప్లేస్ చేయనున్నారు.
- ‘అసెస్‌మెంట్ ఈయర్’ (మదింపు సంవత్సరం)కు సంబంధించిన కాన్సెప్టును మార్చారు.
- స్టాక్ ఆప్షన్లపై పన్నులకు సంబంధించిన నిబంధనలను నూతన ఆదాయపు పన్ను బిల్లులో పొందుపరిచారు.
- ఇకపై ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (CBDT) అనేది పన్ను నిర్వహణ నియమాలను రూపొందించవచ్చు. ఇది పన్ను చెల్లింపులపై అనుశీలన చేయొచ్చు. చట్టాల్లో సవరణలు అక్కర్లేకుండానే డిజిటల్ ట్యాక్స్ పర్యవేక్షక వ్యవస్థల అమలును చేపట్టొచ్చు.