Site icon HashtagU Telugu

Amazon : అమెజాన్ కొత్త సర్వీస్..ఇంట్లోనే వైద్య పరీక్షలు

Amazon Home Diagnostic Serv

Amazon Home Diagnostic Serv

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon ) తాజాగా ఆరోగ్య రంగంలోకి అడుగుపెట్టి హోమ్ డయాగ్నోస్టిక్ సర్వీసును (Amazon Home Diagnostic Service) ప్రారంభించింది. ఈ సేవల ద్వారా వినియోగదారులు తమ ఇంట్లోనే వైద్య పరీక్షలు చేయించుకునే సౌకర్యం పొందనున్నారు. మొదటి దశలో బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, నోయిడా, గురుగ్రాం వంటి ప్రధాన నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నాయని అమెజాన్ వెల్లడించింది.

Kuberaa Success Meet : రశ్మికను శ్రీదేవితో పోల్చిన నాగ్

ఈ సేవల కోసం అమెజాన్, ఆరెంజ్ హెల్త్ ల్యాబ్స్ అనే ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో వినియోగదారులకు నాణ్యమైన, నిబంధనల ప్రకారం జరిగే రక్తపరీక్షలు, ఆరోగ్య పరీక్షలు ఇంటివద్దే అందించనున్నాయి. శాంపిళ్లు సేకరించడం మొదలు, ల్యాబ్ టెస్ట్ ఫలితాల వరకూ అన్నీ ఇంటి నుంచి చేసుకునే వీలుంటుంది.

Air India: మ‌రో ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు..!

ప్రస్తుతం అమెజాన్ యాప్ ద్వారా 800 రకాల వైద్య పరీక్షలు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. యూజర్లు తమకు అవసరమైన టెస్ట్‌ను ఎంచుకుని, ఇంటి చిరునామాను ఇచ్చినపుడు సాంపిల్ కలెక్టర్ వచ్చిన సమయంలో శాంపుల్ తీసుకుని పరీక్షలు చేస్తారు. ఈ ఫలితాలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. ఈ విధానం వల్ల టెస్టుల కోసం హాస్పిటళ్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సమయాన్ని, శారీరక శ్రమను ఆదా చేయవచ్చు.