Site icon HashtagU Telugu

Air India : రూ.3వేల కోట్లతో 67 ఎయిర్ ఇండియా పాత విమానాల అప్‌గ్రేడ్

Air India Old Planes Upgrade

Air India : టాటా గ్రూపు చేతికి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియాను చాలా బాగా సంస్కరించారు. దాని నిర్వహణ తీరులో కీలక మార్పులు జరిగాయి. విమాన ప్రయాణికులకు అందే సేవల్లో నాణ్యత పెరిగింది. దీనికి అదనంగా మరో కొత్త అప్‌గ్రేడ్ ప్రణాళికను ఎయిర్ ఇండియా (Air India) ప్రకటించింది. వివరాలివీ..

Also Read :Bajaj New Motorcycles : బజాజ్ నుంచి రెండు కొత్త 400 సీసీ బైక్స్.. ఫీచర్లు ఇవే

దాదాపు రూ.3వేల కోట్ల పెట్టుబడితో 67 పాత విమానాలను అప్‌గ్రేడ్ చేసి, వాటిలో అధునాతన సౌకర్యాలను కల్పించేందుకు ఎయిర్ ఇండియా రెడీ అయింది. అప్‌గ్రేడ్ చేయనున్న విమానాల జాబితాలో.. 40 వైడ్ బాడీ బోయింగ్ విమానాలు, 27 న్యారో బాడీ ఎయిర్ బస్ ఏ320నియో విమానాలు ఉన్నాయి. విడతల వారీగా ఈ విమానాలను ఆధునిక సౌకర్యాలతో అప్‌గ్రేడ్ చేయనున్నారు. తద్వారా వాటిలో ప్రయాణించే వారికి అద్భుతమైన కంఫర్ట్ లభిస్తుంది. ప్రయాణ అనుభవం చాలా బెటర్ అవుతుంది. విమానాల లోపల లగ్జరీ అండ్ రిచ్ లుక్ అందుబాటులోకి వస్తుంది. ఈ అప్‌గ్రేడ్ ప్రక్రియలో భాగంగా 67 విమానాల్లో సీట్లు, కార్పెట్‌లు, కర్టెన్‌లు, అప్‌హోల్‌స్టరీలు, ఇతర క్యాబిన్ ఇంటీరియర్స్‌ను మారుస్తారు.

Also Read :Man Control Alexa : మెదడుతో అలెక్సాను కంట్రోల్ చేయొచ్చు.. ఎలా అంటే ?

ప్రతినెలా మూడు నుంచి నాలుగు న్యారో బాడీ విమానాలను అప్‌గ్రేడ్ చేయాలని ఎయిర్ ఇండియా భావిస్తోంది. 2025 జూన్ నాటికి న్యారో బాడీ విమానాల అప్‌గ్రేడ్ ప్రక్రియ  పూర్తి అవుతుంది. ఇప్పటికే ఏ320నియో విమానాల అప్‌గ్రేడ్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ విమానంలోని బిజినెస్ క్లాస్‌లో 8 లగ్జరీ సీట్లు , ప్రీమియం ఎకానమీ విభాగంలో 24 అదనపు లెగ్‌రూమ్ సీట్లు, ఎకానమీ విభాగంలో 132 సీట్లు ఉంటాయి. ఈ విమానంలో విశాలమైన లెగ్‌రూమ్, ఆధునిక లైటింగ్, ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ పోర్ట్ వంటివన్నీ ఏర్పాటు చేస్తారు. ఇక 40 పాత వైడ్‌బాడీ బోయింగ్ 787, 777 విమానాల ఇంటీరియర్‌లను అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియను వచ్చే సంవత్సరం ప్రారంభంలో మొదలుపెట్టే అవకాశం ఉంది.

Also Read :Three Seamers Or Three Spinners: బంగ్లా వ‌ర్సెస్ భార‌త్‌.. ముగ్గ‌రు స్పిన్న‌ర్లు లేదా ముగ్గురు బౌల‌ర్ల‌తో బ‌రిలోకి..!