1000 Joining Letters : క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలో భాగంగా రెండేళ్ల క్రితం (2022 సంవత్సరంలో) దాదాపు వెయ్యి మంది ఫ్రెషర్లను సిస్టమ్ ఇంజినీర్ల పోస్టుల కోసం ఇన్ఫోసిస్ కంపెనీ ఎంపిక చేసింది. అయితే ఎట్టకేలకు ఆ వెయ్యి మందికి ఇప్పుడు జాబ్ ఆఫర్ లెటర్లను కంపెనీ అందించింది. వారందరికీ ఈ నెలాఖరులో లేదా అక్టోబరులో అపాయింట్‌మెంట్లు ఉంటాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంతో వెయ్యి మంది యువ ఉద్యోగార్థుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారంతా త్వరలోనే ఓ జాబ్(1000 Joining Letters) వాళ్లు కాబోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
త్వరలోనే కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించే రెండు ప్రీ-ట్రైనింగ్ సెషన్లకు హాజరుకావాలని సిస్టమ్ ఇంజినీర్ల పోస్టులకు ఎంపికైన వెయ్యి మందికి ఇన్ఫోసిస్ సూచించింది. అక్టోబరు 7న జాబ్‌లో జాయిన్ కావాలని నిర్దేశించింది. ఈవివరాలను ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. జాబ్ ఆఫర్ లెటర్‌కు సంబంధించిన డాక్యుమెంటును కూడా వారికి పంపారు. కర్ణాటకలోని మైసూర్‌లో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో రిపోర్టు చేయాలని వారందరినీ కంపెనీ కోరింది. ఒకవేళ ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి కాకముందే కంపెనీని వీడాల్సి వస్తే తప్పకుండా రూ.లక్ష నష్ట పరిహారం చెల్లించాలనే షరతు గురించి తెలియజేసింది.
Also Read :Trigrahi Yoga : ఈనెలలో త్రిగ్రాహి యోగం.. ఆ మూడు రాశుల వారికి రాజయోగం
కొత్తగా జాబ్‌లో చేరబోతున్న ఈ వెయ్యి మందికి దాదాపు రూ.3.7 లక్షల వార్షిక వేతన ప్యాకేజీని అందించనున్నారు. 2 వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌లను సిస్టమ్ ఇంజనీర్లు (SE), డిజిటల్ SE పోస్టుల ఇన్ఫోసిస్ ఎంపిక చేసినప్పటికీ.. పోస్టింగుల ఇవ్వడంలో జాప్యం చేస్తుండటంపై IT అండ్ ITES యూనియన్ ఇటీవలే కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో ఫ్రెషర్‌లకు ఇచ్చిన మాటను తమ కంపెనీ తప్పకుండా గౌరవిస్తుందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వారం కిందటే ప్రకటించారు. ఆయన ప్రకటనకు అనుగుణంగానే ఇప్పుడు కంపెనీ వర్గాల నుంచి సమాచారం బయటికి రావడం గమనార్హం.