Site icon HashtagU Telugu

Second Hand Cars : సెకండ్ హ్యాండ్ కార్స్ కొనడం వల్ల లాభాలు , నష్టాలు ఇవే !!

Luxury Cars

Luxury Cars

ప్రస్తుత రోజుల్లో అందరికీ కారు అనేది ఓ కలగా మారింది. అయితే కొత్త కారు కొంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకే చాలామంది సెకండ్‌ హ్యాండ్‌ కార్ల (Second Hand Cars) వైపు మొగ్గు చూపుతుంటారు. ఒకవేళ మీరు మొదటిసారి కారు కొనాలనుకుంటే, యూజ్డ్ కారు ఒక సరైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ధర తక్కువగా ఉండటంతో పాటు తక్కువ రుణం, తక్కువ బీమా ప్రీమియం, కొన్నిసార్లు మరమ్మత్తులపై కూడా వారంటీ లభించే అవకాశాలుంటాయి. ముఖ్యంగా టాప్ వేరియంట్ మోడల్స్‌ను తక్కువ ధరలో పొందే ఛాన్స్ ఉంది.

Tea : “టీ”లో యాలకులు వేసుకొని తాగుతున్నారా..? ఇది మంచిదేనా.?

ఇలా ప్రయోజనాలే కాకుండా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌లో మోసపోవడం పెద్ద ప్రమాదం. ఎలాగైనా చీప్ లో లగ్జరీ కారు కొనాలని చూస్తే, తర్వాత మరమ్మత్తుల భారంతో ఇబ్బందులొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యక్తుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తే వారంటీ రాదు. బ్యాంకులు కూడా యూజ్డ్ కార్లపై ఎక్కువ వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి. పైగా మనకు నచ్చిన మోడల్ లేదా రంగులో ఉండే కారు దొరకకపోవచ్చు.

Bharat Bandh Effect : ఈ రంగాలపై తీవ్ర ప్రభావం

కొత్త కార్ల మీద కంపెనీలు పెద్ద డిస్కౌంట్లు ఇస్తుంటే, యూజ్డ్ కార్ల మార్కెట్లో అది అరుదు. ధర తక్కువే అయినా అదనపు లాభాలు ఉండవు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని అవసరాలను రాజీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మీరు బ్రాండెడ్ డీలర్‌షిప్ నుంచి కొంటే, కొంత భద్రత ఉంటుంది. ఇలా సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు ఒక మంచి ఆప్షన్ అయినప్పటికీ, పూర్తిగా పరిశీలించి, నష్టాలపై ధైర్యం చేసి ముందుకు వెళ్ళాలి. వాహనం నాణ్యత, మెయింటెనెన్స్, వారంటీ, బీమా, రిజిస్ట్రేషన్ వంటి అంశాలు అన్ని స్పష్టంగా చూసిన తర్వాతే కొనుగోలు చేయాలి. అంతేకాని కేవలం తక్కువ ధర అని చూస్తే, ఆ తర్వాత ఇబ్బందుల్లో పడొచ్చు.