Bajaj New Motorcycles : బజాజ్ నుంచి రెండు కొత్త 400 సీసీ బైక్స్.. ఫీచర్లు ఇవే

మొత్తం మీద బజాజ్ ఆటో కంపెనీ(Bajaj New Motorcycles) హీరో, హోండాలను ఢీకొనేందుకు బ్రిటీష్ కంపెనీతో జట్టు కట్టి సరికొత్త ఫీచర్లను వాహన ప్రియులకు అందించే పనిలో నిమగ్నమైంది.

Published By: HashtagU Telugu Desk
Bajaj New Motorcycles Triumph Speed T4 My25 Speed 400

Bajaj New Motorcycles : బజాజ్‌ ఆటో కంపెనీ బ్రిటీష్‌ మోటార్‌ సైకిల్‌ కంపెనీ ట్రయంఫ్‌‌తో కలిసి మరో రెండు కొత్త బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. వాటిపేర్లు.. ట్రయంఫ్‌ స్పీడ్‌ టీ4, స్పీడ్‌ 400 ఎంవై25. ఈ రెండు బైక్స్ కూడా 400 సీసీ  ఇంజిన్‌తో లభిస్తాయి.  స్పీడ్‌ టీ4 ఎక్స్ షోరూం ధర రూ.2.17 లక్షలు. స్పీడ్‌ 400 ఎంవై25  ఎక్స్ షోరూం ధర రూ.2.40 లక్షలు.

Also Read :Man Control Alexa : మెదడుతో అలెక్సాను కంట్రోల్ చేయొచ్చు.. ఎలా అంటే ?

ట్రయంఫ్‌ స్పీడ్‌ టీ4 బైక్‌ గురించి.. 

  • ట్రయంఫ్‌ స్పీడ్‌ టీ4 బైక్‌లో లిక్విడ్‌ కూల్డ్‌, సింగిల్‌ సిలిండర్‌ యూనిట్‌ ఉంటాయి.
  • 7000 ఆర్‌పీఎం వద్ద 30.6 బీహెచ్‌పీ పవర్‌ను ఈ బైక్ ఉత్పత్తి చేస్తుంది. 5000 ఆర్‌పీఎం వద్ద 36ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
  • ఈ బైక్‌ గరిష్ఠంగా గంటకు 135 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించగలదు.
  • 6 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ఇందులో ఉంటాయి.
  • ఎల్‌ఈడీ లైటింగ్‌ సిస్టమ్‌, డిజిటల్‌ డిస్‌ప్లే, బ్లూటూత్‌ కనెక్టివిటీ, ట్రాక్షన్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఈ బైకులో ఉన్నాయి.
  • ట్రయంఫ్‌ స్పీడ్‌ టీ4 బైక్‌ మూడు రంగుల్లో లభిస్తుంది.
  • ఫుల్ ఎల్‌ఈడీ లైటింగ్, 17 అంగుళాల అలాయ్ వీల్స్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ ప్యానెల్ ఈ బైకులో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
  • 43 మిల్లీమీటర్ల టెలీస్కోపిక్ ఫోర్క్స్‌ ఈ బైకులో అడ్వాన్స్‌డ్ సస్పెన్షన్‌ను అందిస్తాయి.
  • ఈ బైకు ముందు భాగంలో బ్రేకింగ్ కోసం 300 మిల్లీమీటర్ల డిస్క్ ఉంటుంది. వెనుక భాగంలో బ్రేకింగ్ కోసం 230 మిల్లీమీటర్ల డిస్క్ ఉంటుంది. బైకర్ సేఫ్టీ కోసం ఈ బైకులో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వ్యవస్థ ఏర్పాటై ఉంది.
  • మొత్తం మీద బజాజ్ ఆటో కంపెనీ(Bajaj New Motorcycles) హీరో, హోండాలను ఢీకొనేందుకు బ్రిటీష్ కంపెనీతో జట్టు కట్టి సరికొత్త ఫీచర్లను వాహన ప్రియులకు అందించే పనిలో నిమగ్నమైంది. ఈక్రమంలోనే ఈ రెండు బైక్స్‌ను విడుదల చేసింది.
  • ఈ ఏడాది  చివరికల్లా ఈ సరికొత్త బైక్స్ మంచిసేల్స్‌ను సాధించిపెడతాయనే ఆశాభావంతో బజాజ్ ఆటో ఉంది.

Also Read :Indians Earning : మన దేశంలో 31,800 మందికి ఏటా రూ.10 కోట్ల ఆదాయం

  Last Updated: 17 Sep 2024, 04:20 PM IST