2019 ఎన్నికల్లో కరణం బలరాం టీడీపీ(TDP) నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కానీ ఆ తర్వాత కొంతకాలానికే తన కుమారుడు కరణం వెంకటేష్(Karanam Venkatesh) తో కలిసి జగన్(Jagan) ని కలిశారు. అప్పట్నుంచి బలరాం టీడీపీలో ఉంటున్నా టీడీపీకి దూరంగానే ఉంటున్నారు. కరణం వెంకటేష్ మాత్రం అధికారికంగా వైసీపీ(YCP)లో చేరి చీరాల(Chirala) ఎమ్మెల్యే(MLA) టికెట్ కోసం చూస్తున్నారు.
అయితే చీరాలలో కొన్నాళ్ల క్రితం వరకు వైసీపీ టికెట్ కోసం ఆమంచి, కరణం వెంకటేష్, సునీత పోటీ పడినా ఆమంచి కృష్ణమోహన్ కి పర్చూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఎమ్మెల్సీ సునీతకు మరోసారి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి కరణం వెంకటేష్ కి చీరాల నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు. అయితే పార్టీ టికెట్ మాత్రం ప్రకటించలేదు.
కానీ కరణం వెంకటేష్ మాత్రం చీరాల వైసీపీ ఎమ్మెల్యే టికెట్ నాకే అని, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే పోటీ చేసి గెలుస్తానని అంటున్నాడు. తాజాగా మరోసారి ఇదే వ్యాఖ్యలు చేశాడు కరణం వెంకటేష్. నేడు చీరాలలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి వేడుకల్లో చీరాల వైసీపీ ఇన్‌చార్జ్ కరణం వెంకటేష్ పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం కరణం వెంకటేష్ మీడియాతో మాట్లాడారు.
కరణం వెంకటేష్ మాట్లాడుతూ.. తండ్రి బాటలో సంక్షేమం, అభివృద్ది రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని చెప్పి ప్రతిపక్ష నాయకులపై ఫైర్ అయ్యారు. అలాగే చీరాలను ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తాము. రాబోయే ఎన్నికల్లో చీరాల ఎమ్మెల్యేగా నేను పోటీచేసి గెలుస్తాను. వచ్చే రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే హోదాలోనే పాల్గొంటాను అని తెలిపాడు కరణం వెంకటేష్. దీంతో కరణం వెంకటేష్ కి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తాడని చెప్పాడా? చీరాల వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఫిక్స్ అయిపోయిందా అని చర్చించుకుంటున్నారు.
Also Read : Nara Lokesh : వైసీపీ నాయకుల ఫిర్యాదుతో.. నారా లోకేష్ పై కేసు నమోదు..