YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ రోజు అనకాపల్లిలో పర్యటిస్తున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఎస్సైన్షియా ఫార్మా కంపెనీలో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు వెళ్లారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులను పరామర్శించి, గాయపడిన వారిని కలిశారు.
అనకాపల్లిలో ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 18 మంది బాధితులను కలిసి పరిమర్శించారు జగన్. జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గంలో ఉషా ప్రైమ్ ఆసుపత్రికి చేరుకుంన్నారు. తన పర్యటన సందర్భంగా, చికిత్స పొందుతున్న వారికి తన మద్దతును తెలియజేశారు. 18 మంది వ్యక్తులు ఉషా ప్రైమ్ హాస్పిటల్‌లో, ఏడుగురు మెడికోవర్ హాస్పిటల్‌లో మరియు ఐదుగురు కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
జగన్ పర్యటనలో భాగంగా బాధితులకు అందుతున్న వైద్యం, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్. ఆస్పత్రి వర్గాలతో మాట్లాడిన జగన్, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కాగా జగన్ రాకతో ఆ ప్రాంతమంతా వైసీపీ శ్రేణులతో నిండిపోయింది. ఆస్పత్రి ఆవరణలో భారీగా అభిమానులు వచ్చి చేరుకున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న గురువారం బాధితులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతులకు కోటి రూపాయలు పరిహారం కింద ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడితే రూ.50 లక్షలు, స్వల్ప గాయాలకు రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.
Also Read: Mobile Network: మీ మొబైల్ లో నెట్‌వర్క్ ప్రాబ్లమా.. అయితే వెంటనే ఇలా చేయండి!