YS Jagan : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు మిర్చియార్డుకు చేరుకున్నారు. అక్కడ యార్డును పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మిర్చి రైతుల అవస్థలు చంద్రబాబుకు పట్టడం లేదన్నారు. ఈరోజు రైతులు ఎరువులు బ్లాక్ లో కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఈరోజు రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్థితి. మిర్చి పంటకు కనీసం రూ.11వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. పండించిన పంటను రైతులు అమ్ముకునే పరిస్తితి లేకుండా పోయిందన్నారు. గుంటూరు మిర్చి రైతులకు జగన్ సంఘీభావం తెలిపారు.
Read Also: Qatar King : రేంజే వేరప్ప.. ఖతర్ రాజు కళ్లు చెదిరే సంపద
ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంతో వైసీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయన.. ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. మా హయాంలో.. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. రూ.21 వేల నుంచి రూ. 27 వేల దాకా వచ్చేది. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం అన్నారు.
రైతులు పండించినపంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి. మిర్చి పంటకు కనీసం రూ.11 వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఈ ఏడాది దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. రైతులను దళారీలకు అమ్మేసే పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైసీపీ ఉద్యమిస్తుందని వైఎస్ జగన్ హెచ్చరించారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలి. గుంటూరు మిర్చియార్డుకు కావాలి. రైతుల కష్టాలు తెలుసుకోవాలని వైఎస్ జగన్ అన్నారు.