Site icon HashtagU Telugu

YS Jagan : 9 నెలల్లో రికార్డు అప్పులు.. ప్రజలపై మోసం

YS Jagan Tweet

YS Jagan Tweet

YS Jagan : మరోసారి మాజీ సీఎం వైస్‌ జగన్‌ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో, వైఎస్ జగన్‌ మాట్లాడుతూ ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి గురించి తీవ్ర విమర్శలు చేశారు. ఈ నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు రికార్డులను మించినవిగా ఉన్నాయని ఆయన అన్నారు. “9 నెలల్లో బడ్జెట్‌ అప్పులే రూ. 80,820 కోట్లు,” అని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా, అమరావతి పేరుతో ప్రభుత్వాలు తీసుకున్న మరో అప్పు రూ. 52,000 కోట్లు, , APMDC ద్వారా తీసుకున్న అప్పు రూ. 5,000 కోట్లు, మొత్తంగా 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 1,40,000 కోట్ల మేర అప్పులు చేసినట్లు ఆయన ఆరోపించారు.

అయితే, ఈ అప్పుల వృద్ధి పట్ల ఆయన గట్టి ప్రశ్నలు ఉంచారు. “ఇన్ని అప్పులు చేసినా, సూపర్-6 ఇచ్చారా? పేదలకేమైనా బటన్లు నొక్కారా?” అని వైఎస్ జగన్ అడిగారు. గతంలో అమలు చేసిన పథకాలు ఎక్కడా కొనసాగుతున్నాయా? “అమ్మఒడి, రైతు భరోసా, వసతి దీవెన, విద్యాదీవెన, చేయూత, ఆసరా, వాహనమిత్ర, నేతన్న నేస్తం, చేదోడు, లా నేస్తం” వంటి పథకాలు అంతం అయ్యాయని ఆయన పేర్కొన్నారు.

Health Tips : మఖానాను పాలలో కలిపి తింటే ఏమవుతుంది? నిపుణుల నుండి తెలుసుకోండి

వారు ఆయా అప్పుల డబ్బులు ఎక్కడ పోతున్నాయో కూడా ప్రశ్నించారు. “రూ. 1,40,000 కోట్ల అప్పులు ఎవరి జేబులోకి పోతున్నాయంటే?” అని ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు ఇచ్చామని చెప్పినప్పటికీ, కొత్త ఉద్యోగాలను ఇవ్వకుండా, 2 లక్షలకు పైగా వాలంటీర్ల ఉద్యోగాలను తీసుకున్నారని, అలాగే గ్రామ , వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర శాఖలలో సర్దిచేయాలని ఆయన ఆరోపించారు. “వాలంటీర్లను ఎలా మోసం చేశారో, ఉద్యోగుల్ని కూడా అదే విధంగా మోసం చేస్తున్నారు,” అని ఆయన మండిపడ్డారు.

“ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని” వైఎస్ జగన్ విమర్శించారు. “ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇచ్చామని చెప్పినా, ఉన్న పీఆర్సీ ఛైర్మన్‌ను పంపించేశారు,” అని ఆయన అన్నారు. “ఏ నెలలో ఒక్కో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇచ్చారో చెప్పండి,” అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

“నేడు జరుగుతున్నది ఆర్థిక విధ్వంసం,” అని జగన్ చెప్పినట్లు, గతంలో ఆయన హయాంలో 4 పోర్టులు నిర్మించడంతో పాటు, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించడానికి చర్యలు తీసుకున్నారని చెప్పారు.

తర్వాత, చంద్రబాబుపై కూడా ఆయన విమర్శలు చేసినారు. “సంపద సృష్టి అంటే తన ఆస్తి పెంచుకోవడమే” అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ఇసుక వల్ల రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా లాభం రాలేదని, కానీ ఇసుక ధర మాత్రం రెండింతలు అయినట్లు చెప్పారు. “బెల్టు షాపులకు ఎమ్మెల్యేలు తిరిగి వేలం వేస్తున్నారు, మాఫియా జరుగుతోంది,” అని ఆయన మండిపడ్డారు.

“ఎంత ముఖ్యమైన పని అయినా, ఎమ్మెల్యేలకు వాటా ఇవ్వాల్సిందే. అందులో కొంత వాటా పెదబాబు, చినబాబు, దత్తపుత్రుడికి ఇస్తున్నారు,” అని ఆయన సెటైర్లు వేశారు. “ఎన్టీఆర్ కంటే ఎక్కువ నటిస్తున్న చంద్రబాబుకు అవార్డులు ఇవ్వాలి,” అని జగన్ వ్యాఖ్యానించారు. “ప్రజలు నా మాట వినకుండా మోసపోయారు,” అని వైఎస్ జగన్ అన్నారు.

India Test Team: రోహిత్‌ తర్వాత టెస్టు జట్టు కెప్టెన్‌గా ఎవరు ఎంపిక అవుతారు? రేసులో యువ ఆట‌గాళ్లు!