YS Jagan : జ‌గ‌న్ మాటంటే.. తుస్!

ప్ర‌తిప‌క్షంలో ఉన్నప్పుడు `అవినీతి చ‌క్ర‌వ‌ర్తి` పేరుతో చంద్ర‌బాబు పై ఆరోప‌ణ‌లు చేస్తూ ఒక పుస్త‌కాన్ని ఢిల్లీ వేదిక‌గా పంచాడు. ముఖ్య‌మంత్రి ఒక్క ఛాన్స్ ఇస్తే మొత్తం అవినీతిని బ‌య‌ట‌పెడ‌తాన‌ని హామీ ఇచ్చాడు. తిన్న డ‌బ్బు క‌క్కిస్తా..చంద్ర‌బాబు అండ్ టీంను జైలులో ఊచ‌లు లెక్కిపెట్టిస్తానంటూ ప్ర‌తి వేదిక‌పైనా చెప్పాడు.

Published By: HashtagU Telugu Desk

ప్ర‌తిప‌క్షంలో ఉన్నప్పుడు `అవినీతి చ‌క్ర‌వ‌ర్తి` పేరుతో చంద్ర‌బాబు పై ఆరోప‌ణ‌లు చేస్తూ ఒక పుస్త‌కాన్ని ఢిల్లీ వేదిక‌గా జగన్ పంచాడు. ముఖ్య‌మంత్రి  గా ఒక్క ఛాన్స్ ఇస్తే మొత్తం అవినీతిని బ‌య‌ట‌పెడ‌తాన‌ని హామీ ఇచ్చాడు. తిన్న డ‌బ్బు క‌క్కిస్తా..చంద్ర‌బాబు అండ్ టీంను జైలులో ఊచ‌లు లెక్కిపెట్టిస్తానంటూ ప్ర‌తి వేదిక‌పైనా చెప్పాడు. ప్ర‌జ‌లు ఆయ‌న మాట‌ల‌ను విశ్వసించి ఒక్క‌ఛాన్స్ ఇచ్చారు. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని కూర్చొబెట్టారు. సీన్ క‌ట్ చేస్తే…ఆనాడు చంద్ర‌బాబుపై చేసిన ఒక్క ఆరోప‌ణ‌ను కూడా నిరూపించ‌లేక‌పోయాడు. అధికారం వ‌చ్చి రెండున్న‌రేళ్ల త‌రువాత వాటిని ఒక సారి అవ‌లోనం చేసుకుంటే..ఇలా ఉన్నాయి..ఆనాడు జ‌గ‌న్ చేసిన ఆరోప‌ణ‌లు.

1) చంద్రబాబు ప్రభుత్వం డేటా చోరీ చేసి ఓటు తొలగిస్తుందని ప్రచారం చేశారు

జ‌వాబు: కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు ఎటువంటి డేటా చోరీ జరగలేదని కేంద్రం తేల్చి చెప్పింది

2) తిరుమలలో పింక్ డైమండ్ పోయిందని అది చంద్రబాబు ఇంట్లో ఉందని రమణ దీక్షితులు విజయసాయి రెడ్డి ఆరోపించాడు దానికి పవన్ కూడా వంత పాడాడు

జ‌వాబు: YCP అధికారంలోకి వచ్చిన తర్వాత పింక్ డైమండ్ లేదని టీటీడీ ఈవో ప్రకటించాడు హైకోర్టు కూడా పింక్ డైమండ్ పై విచారణ అవసరం లేదని తేల్చిచెప్పింది

3) 37 మందిలో 35 మంది కమ్మ వారికి సీఐ నుంచి డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చాడు అని నాడు జగన్ రెడ్డి విష ప్రచారం చేశాడు

జ‌వాబు: కానీ అది పచ్చి అబద్ధం అందులో
కమ్మ వారు – 2
బీసీలు – 9,
రెడ్డిలు – 7,
దళితులు – 7
కాపులు – 4
ముస్లింలు – 2
మిగిలిన వారు ఇతర కులాల వారు

4) పోలవరంలో భారీ అవినీతి జరిగిందని అది చంద్రబాబు దోచుకున్నాడు అన్నారు . కొంతమంది మేధావి ముసుగులో ఉన్న వారితో కూడా ఇదే ప్రచారం చేయించాడు

జ‌వాబు: పెంటపాటి పుల్లారావు రాసిన లేఖకు పోలవరంలో ఎటువంటి అవినీతి జరగలేదని విచారణ అవసరం లేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి స్పష్టం చేశారు

5) ప్రతిపక్షంలో పోలవరానికి పునాదులు పడలేదు అన్నారు తరువాత 20% పనులు కూడా జరగలేదని విమర్శించారు

జ‌వాబు:కానీ పోలవరంలో 71% పనులు జరిగాయని జగన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశాడు. కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి 70% పనులు పూర్తి అయినట్టు సమాధానం ఇచ్చారు

6) చంద్రబాబు 30 వేల కోట్లు అంచనాలు పెంచింది దోచుకోవడానికే అని జగన్ రెడ్డి విమర్శించాడు

జ‌వాబు: దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయడమే కాకుండా సాక్షి పత్రికల్లో క‌థ‌నాలు రాతలు రాశాడు .కానీ జగన్ సీఎం అయిన తర్వాత చంద్రబాబు ప్రతిపాదించిన అంచనాలను ఆమోదించాలని కేంద్రాన్ని కోరాడు

7) రివర్స్ టెండర్ ద్వారా తక్కువ ధరకే పోలవరం పనులు ఇచ్చామని దీనివల్ల 780 కోట్లు మిగులు వచ్చిందని ప్రచారం చేశారు

జ‌వాబు: కానీ గతం కంటే ప్రధాన డ్యామ్ 1,656 కోట్లు కుడి కాలువ ఎత్తిపోతలకు 912 కోట్లు ఇసుకకు 500 కోట్లు అంచనాలు పెంచారు ఒక్క రోజులో హెడ్ వర్క్ 2569 కోట్లు పెరిగింది

8) మొదట 2021 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తానని జగన్ రెడ్డి చెప్పారు

జ‌వాబు:మాట తప్పి 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి అనిల్ చెప్పాడు

9) జగన్ రెడ్డి పై జరిగిన కోడి కత్తి దాడిలో చంద్రబాబు డీజీపీ పాత్ర ఉందని సొంత మీడియాలో విష ప్రచారం జ‌రిగింది.

జ‌వాబు: జగన్ కి వైద్యం చేసిన డాక్టర్ వైద్య మండలి చైర్మన్ అయ్యాడు 2019 ఎన్నిక ఫలితాల రోజు శీనుకి బెయిల్ వచ్చింది. జగన్ సీఎం 3 ఏళ్ళు అవుతున్నా నేటికి ఆ కేసు ఊసేలేదు

10) పోలవరానికి కేంద్రం సాయం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదా అని ప్రతిపక్షంలో ప్రశ్నించిన జగన్ రెడ్డి

జ‌వాబు: సీఎం అయిన తరువాత సవరించిన అంచనాలు అలాగే గత బకాయిలను చెల్లించాలని కేంద్రాన్ని అడగనే లేదు అనే పార్లమెంటు సాక్షిగా తేల్చి చెప్పారు

11) పట్టిసీమ ప్రాజెక్టులో 400 కోట్ల అవినీతి జరిగిందని నాడు జగన్ రెడ్డి విమర్శించాడు

జ‌వాబు: కానీ పట్టిసీమ ప్రాజెక్టులో 400 కోట్ల అవినీతి కేవలం ఆరోపణలు అని దానికి ఎటువంటి ఆధారాలు లేవని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పింది

12) చంద్రబాబు 30కి పైగా స్టేలు తెచ్చుకుని బయట తిరుగుతున్నాడు అని అవి తేలితే జైలుకు వెళతాడని విమర్శించారు

జ‌వాబు: చంద్రబాబు పై ఈరోజు ఒక్క స్టే కూడా లేదు కేవలం బాబ్లీ ప్రాజెక్టు సంబంధించిన కేసు మాత్రం నడుస్తుంది

13) కియా ప్రాజెక్టు ఉత్తి బోగస్ అని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదని అక్కడ యువత ఉద్యమం చేస్తున్నారని ధర్నాకు దిగాడు

జ‌వాబు: సీఎం అయిన తర్వాత అదే కియా ప్రాజెక్టును మరొకసారి ఓపెన్ చేసి కియా వల్ల యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అన్నాడు

14) ESI కొనుగోళ్లలో 151 కోట్ల కుంభకోణం జరిగిందని దానికి నాడు మంత్రిగా ఉన్న అచ్చం నాయుడు కారణమంటూ కక్షగట్టి అరెస్టు చేశారు

జ‌వాబు: అచ్చం నాయుడుకి ఈ స్కామ్ కి సంబంధం లేదని దానికి ఆధారాలు లేవని కేవలం ఒప్పందానికి అనుమతి ఇచ్చారని ఏసీబీ తేల్చి చెప్పింది

15) ఏపీ ఫైబర్ నెట్లో 1500 కోట్ల స్కామ్ జరిగిందని దానికి లోకేష్ సంతకమే రుజువు అని అరెస్టు చేయటం ఖాయం అన్నారు

జ‌వాబు: ఫైబర్ నెట్ స్కాంలో FIR నమోదు చేసిన 19 మందిలో అసలు లోకేష్ పేరు లేదు . 750 కోట్ల ప్రాజెక్టులో 1500 కోట్ల అవినీతి ఎలా జరిగిందో వైసీపీ నేటికీ చెప్పలేదు

16) నేను సీఎం అయిన తర్వాత అమరావతి రాజధానిగా కొనసాగిస్తాను నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అన్నాడు

జ‌వాబు: 6 నెలలు గడవక ముందే అమరావతిని కాదని 3 రాజధానులు తెరపైకి తెచ్చాడు

17) అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చంద్రబాబు బినామీలు అక్కడ భూములు కొన్నారు అన్నాడు

జ‌వాబు: అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదమే లేదని అక్కడ బినామీలు భూములు కొన్నట్లు ఆధారం లేదని హైకోర్టు, సుప్రీంకోర్టు రెండు తేల్చి చెప్పాయి

18) అమరావతిలో మొత్తం కమ్మ సామాజిక వర్గం వారే ఉన్నారని కమ్మరావతి అంటూ విష ప్రచారం చేశాడు

జ‌వాబు: అమరావతి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అక్కడ SC,ST – 34%, రెడ్డి – 23%, కమ్మ – 18%, BC – 14% ఉన్నారు

20) అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదని అదంతా బాహుబలి గ్రాఫిక్స్ అన్నాడు

జ‌వాబు: జగన్ సీఎం అయిన తర్వాత అమరావతిలో భవనాలు 70% పైగా పూర్తయినట్టు పురపాలక శాఖ నివేదిక ఇచ్చింది .అమరావతి స్మశానం అన్న బొత్స కూడా అమరావతి వెళ్లి బిల్డింగ్స్ అన్ని చూసి వచ్చాడు

21) తెలంగాణ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర ఉందని ప్రచారం చేశారు

జ‌వాబు: ఓటుకు నోటు కేసులో దాఖలు చేసిన చార్జిషీట్లో ఎక్కడ చంద్రబాబు పేరు లేదు

22) టీటీడీ బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అని వందల కోట్ల అవినీతి సొమ్ముతో సిబిఐకి దొరికి పోయాడని విమర్శించాడు

జ‌వాబు: జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే శేఖర్ రెడ్డిని తిరిగి టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించాడు

23) లోకేష్ కు శేఖర్ రెడ్డి 100 కోట్లు ఇచ్చాడని ఆరోపణలు చేశారు పచ్చపుట్టలో నల్లత్రాచు అంటూ పత్రిక సాక్షిలో కథనాలు రాశాడు

జ‌వాబు: తరువాత అదే సాక్షిలో అపనిందను అధికమించి శ్రీవారికి చెంతకు చేరాడు అని జగన్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చినప్పుడు రాశాడు

24) చంద్రబాబు ఉచితంగా ఇస్తున్న ఇసుక లో అవినీతి అక్రమాలు ఉన్నాయని ప్రతిపక్షంలో విమర్శించాడు

జ‌వాబు: జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత యూటర్న్ తీసుకుని గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు జరగలేదని NGT కి లేఖ ఇచ్చాడు

25) ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు 6 లక్షల కోట్లకు పైగా అవినీతి చేశాడని ఆధారాలు కూడా ఉన్నాయని పుస్తకం విడుదల చేశాడు

జ‌వాబు: జగన్ సీఎం అయ్యి 3 ఏళ్ళు గడుస్తున్నా ప్రభుత్వం ఆయన చేతుల్లోనే ఉన్న చంద్రబాబుపై కానీ కుటుంబ సభ్యులపై కానీ ఒక్క అవినీతి కేసు నమోదు చేయలేదు ఆరోపణలు నిరూపించలేదు.

స్టూలంగా ఈ 25 ఆరోప‌ణ‌ల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎక్కువ‌గా చంద్ర‌బాబు మీద ఎక్కుపెట్టాడు. వాటిలో ఏ ఒక్క‌టి కూడా నిరూప‌ణ కాలేదు. మాట‌త‌ప్ప‌డం మ‌డ‌మ తిప్పడం అల‌వాటులేని జ‌గ‌న్ వీటికి స‌మాధానం చెప్పాల‌ని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఇప్ప‌టికైనా ఒక్క‌దాన్నైనా నిరూపించండంటూ నిల‌దీస్తోంది.

  Last Updated: 04 Jan 2022, 01:45 PM IST