YCP : క్యాడర్, లీడర్లను బలి పశువులుగా వాడుకుంటున్న జగన్..?

YCP : "మీరు డ్రామాలు వేయండి, నేనిక్కడ నుంచి మీ పెర్ఫార్మెన్స్‌కి మార్కులు వేస్తా" అన్నట్టుగా వ్యవహరిస్తున్న జగన్‌పై పార్టీ అంతటా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
Workers Fire To Jagan

Workers Fire To Jagan

‘వెన్నుపోటు దినం’(vennupotu Dinam)గా వైసీపీ ప్రకటించిన నిరసన కార్యక్రమం అనేక విమర్శలకు దారి తీస్తోంది. పార్టీ శ్రేణులందరికీ రోడ్డెక్కే టార్గెట్లు పెడితే, అసలు నాయకుడు జగన్ (Jagan) మాత్రం బెంగళూరుకు వెళ్లిపోయారు. నాయకుడు ఉంటేనే శ్రద్ధతో కదిలే క్యాడర్‌, ఇప్పుడు ఆయనే కనిపించకపోవడంతో కార్యకర్తలకు, నేతలకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. “మీరు డ్రామాలు వేయండి, నేనిక్కడ నుంచి మీ పెర్ఫార్మెన్స్‌కి మార్కులు వేస్తా” అన్నట్టుగా వ్యవహరిస్తున్న జగన్‌పై పార్టీ అంతటా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాయకుడు ముందు నడిచే బదులు, వీరిని ముందుకు తోసి పక్కన నిలబడటం న్యాయమా? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

World Environment Day : ప్రకృతి మనందరిది..పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: సీఎం చంద్రబాబు

జగన్ రెడ్డి తన నేతల్ని, క్యాడర్‌ను రాజకీయ పావుల్లా వాడుకుంటున్నారని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన స్వప్రయోజనాల కోసం పార్టీ శ్రేణుల్ని బలి పశువుల్లాగా వాడుకుంటూ, అసలు సమస్యలు వచ్చినపుడు వెనుకకు తిసుకుంటున్నారన్న ఆరోపణలు జోరుగా నడుస్తున్నాయి. అధికారంలోకి రావడంలో ముఖ్య పాత్ర పోషించిన కార్యకర్తలను తరువాత వాలంటీర్ పేరుతో విస్మరించడమే కాకుండా, ఇప్పుడైనా అడ్డం పెట్టుకుని తాను బయటుండటం జగనన్న లక్షణమా? అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కేసులు ఎదుర్కొంటున్న నేతల కోసం కనీసం న్యాయ సహాయం, సంఘీభావం చూపించకుండా మౌనం పాటించడం తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.

Ambati Rambabu : వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు

ఈ పరిణామాల వల్ల వైసీపీలో ఉండటం పార్టీ కార్యకర్తలకు శాపంగా మారుతుందని పార్టీలోపలే పెరుగుతున్న అసంతృప్తి తెలుస్తోంది. నాయకుడి కోసం రోడ్డెక్కితే భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. లాఠీ దెబ్బలు తినాల్సి వస్తోంది. కానీ నాయకుడు మాత్రం రాజకీయ లాభాలు కోసమే కనిపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. పార్టీ బతికాలంటే క్యాడర్ అవసరం. కానీ క్యాడర్ కోసం పార్టీ నాయకుడు ఉండాలి. జగన్ తీరుతో ఈ బలమైన బంధమే వీడిపోతుందనే భయాలు వేధిస్తున్నాయి. ఈ పరిస్థితులు మారకపోతే వైసీపీ లో కార్యకర్త అనేవారు ఉండరు.

  Last Updated: 05 Jun 2025, 11:50 AM IST