Site icon HashtagU Telugu

YCP Rebel :ఎన్నిక‌ల్లోపు మ‌రో రెండు హ‌త్య‌లు:`DL`సంచ‌ల‌నం

Ycp Rebel

Ycp Rebel

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రో రెండు హ‌త్య‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి(YCP Rebel) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. స్వ‌ర్గీయ వైఎస్ కుటుంబం గురించి బాగా తెలిసిన సీనియ‌ర్ లీడ‌ర్ ఆయ‌న‌(DL Raveendra Reddy). వైఎస్ త‌ర‌హాలోనే ప‌రిపాల‌న చేస్తాడ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని న‌మ్మారు. అందుకే, 2019 ఎన్నిక‌ల్లో సంపూర్ణ మ‌ద్ధ‌తు ప్ర‌కటించారు. వైసీపీలో చేరి అనుభ‌వాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గెలుపు కోసం వాడారు. సీన్ క‌ట్ చేస్తే, జ‌గ‌న్ వాల‌కం వేరేలా ఉంద‌ని గ‌మ‌నించారు. మ‌రో రెండు హ‌త్య‌లు జ‌రుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆ మేర‌కు ఒక ప్రైవేటు ఛాన‌ల్ కు వ‌చ్చిన ఇంట‌ర్వ్యూలో డీఎల్ ప్ర‌క‌టించ‌డం రాజ‌కీయ ప్ర‌కంప‌న‌ల‌కు దారితీసింది.

మ‌రో రెండు హ‌త్య‌లకు పీకే ప్లాన్ (YCP Rebel)

గ‌త ఎన్నిక‌ల‌కు ముందుగా మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌రిగింది. స్వ‌యానా బాబాయ్ హ‌త్య కావ‌డం స‌హజంగానే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి రాజ‌కీయంగా సానుకూల‌త ఏర్ప‌డింది. పైగా చంద్ర‌బాబు ఆ హ‌త్య చేయించార‌ని ప్ర‌తిప‌క్ష‌నేత హోదాలో అప్ప‌ట్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అండ్ టీమ్ విస్తృతంగా ప్ర‌చారం చేసింది. ఇక విశాఖ ఎయిర్ పోర్టు ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన కోడి క‌త్తి దాడిని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద జ‌రిగిన హ‌త్యాయ‌త్నంగా ప్రాచుర్యం పొందింది. సీన్ క‌ట్ చేస్తే, ఈ రెండు సంఘ‌ట‌న‌లు 2019 ఎన్నిక‌ల్లో తిరుగులేని మోజార్టీతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సీఎంను చేశాయి. ఇదంతా రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ చేసిన కుట్ర‌గా ఇప్పుడు డీఎల్ ర‌వీంద్ర రెడ్డి(DL Raveendra Reddy) బ‌య‌ట‌పెట్టారు. ఆ అనుభావాల దృష్ట్యా రాబోవు రోజుల్లో మ‌రో హ‌త్య‌లు జ‌రుతాయ‌ని ఆయ‌న ఊహిస్తున్నారు.

విజ‌య‌మ్మ‌, షర్మిల ప్రాణాల‌కు ముప్పు

వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని వైసీపీ రెబ‌ల్ డాక్ట‌ర్ డీల్ ర‌వీంద్ర రెడ్డి(DL Raveendra Reddy) అనుమానిస్తున్నారు. వాళ్లిద్ద‌రూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రశాంత్ కిశోర్ సలహా మేరకు మరో ఇద్దరి హత్య జరిగే అవకాశం ఉందని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న(YCP Rebel) చేశారు. గత ఎన్నికల సమయంలో ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకే వివేకా హత్య, వైజాగ్ లో కోడికత్తితో దాడి డ్రామా వంటివి జరిగాయని గుర్తు చేశారు. జగన్ పై కోడికత్తితో దాడి వెనుక కుట్రకోణం లేదని కోర్టుకు ఎన్ఐఏ తెలప‌డంతో ప్ర‌శాంత్ కిషోర్ ఆనాటి ప్లాన్ బ‌య‌ట‌ప‌డింద‌ని అంటున్నారు.

వివేకా హ‌త్య కేసులో ఉద‌య్ అరెస్ట్‌

తాడేపల్లి నుంచి వైఎస్ భారతి రాజ్యాంగం నడుస్తోందని డీఎల్ సంచ‌ల‌న(YCP Rebel) వ్యాఖ్య‌లు చేశారు. వివేకా హత్య కేసులో ఎంత మంది అధికారులను మార్చినా ఒరిగేది లేదని, నిందితులకు కచ్చితంగా శిక్ష పడుతుందని అన్నారు. ఇదిలా ఉండ‌గా, మంత్రి వివేకానందరెడ్డి హత్య విచారణలో శుక్ర‌వారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ వైఎఎస్ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పులివెందులలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లి విచారణ జరిపారు. సీబీఐ కోర్టులో హాజరుపరిచేందుకు కడప నుంచి హైదరాబాద్ కు తరలించారు. ఉదయ్ ను అరెస్ట్ చేసినట్టు ఆయన కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు సమాచారమిచ్చారు.

Also Read : Viveka Murder : వివేకా హ‌త్య కేసులో సీబీఐ దూకుడు.. ఎంపీ అవినాష్ రెడ్డి అనుచ‌రుడిని..?

హత్య జరిగిన రోజున అవినాశ్ రెడ్డి, శివశంకర్‌రెడ్డితో పాటు ఉదయ్ కూడా ఘటనా స్థలానికి వెళ్లినట్టు సీబీఐ గుర్తించింది. ఆ రోజున అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను అక్కడికి రప్పించడంలో ఉదయ్ కీలక పాత్ర పోషించినట్టు అనుమానిస్తోంది. అంతేకాదు, వివేకానందరెడ్డి మృతదేహానికి ఉదయ్ తండ్రి జయప్రకాశ్ రెడ్డి బ్యాండేజ్ కట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఉదయ్‌ను సీబీఐ విచారించింది. ఇప్పుడు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంది. హత్య జరిగిన రోజున అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉదయ్ ఉన్నట్టు గూగుల్ టేకవుట్ ద్వారా సీబీఐ గుర్తించింది. ఆ కోణం నుంచి ద‌ర్యాప్తును వేగ‌వంతం చేసి, ఉద‌య్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇలాంటి ప‌రిణామాల న‌డుమ మ‌రో రెండు హ‌త్య‌లు జ‌రుగుతాయ‌ని వైసీపీ రెబ‌ల్ డాక్ట‌ర్ డీల్ చెప్ప‌డం గంద‌ర‌గోళాన్ని సృష్టిస్తోంది.

Also Read : Jagan attempt murder : కోడిక‌త్తి కేసులో టీడీపీకి NIA క్లీన్ చిట్‌