Site icon HashtagU Telugu

AP : విజయసాయిరెడ్డి రివర్స్ అటాక్‌..టీడీపీ నేతల వల్లే చంద్రబాబు కు హాని

Mp Vijayasai Reddy Reverse

Mp Vijayasai Reddy Reverse

స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Case)లో చంద్రబాబు ను అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించిన దగ్గరి నుండి జైల్లో చంద్రబాబు (Chandrababu)కు ప్రాణ హాని ఉందని కుటుంబ సభ్యులు , టీడీపీ శ్రేణులు , చంద్రబాబు తరుపు లాయర్లు మొత్తుకుంటూనే ఉన్నారు. ఎలాగైనా చంద్రబాబు ను హౌస్ రిమాండ్ కు తరలించాలని పిటిషన్లు దాఖలు చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ఏసీబీ కోర్ట్ మాత్రం వాదనలు వింటూ వస్తుంది తప్ప ..హౌస్ రిమాండ్ కు మాత్రం ఆదేశాలు ఇవ్వడం లేదు.

నేడు కూడా విచారణ రేపటికి వాయిదా వేయడం తో..నారా లోకేష్ (Nara Lokesh) సంచలన ట్వీట్ చేసారు. జైలులోనే చంద్రబాబును చంపే కుట్ర (Chandrababu Murder) జరుగుతుందన్నారు. సైకో జగన్ తమ పార్టీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించి జైలులోనే అంతం చేేసే ఆలోచన చేస్తున్నారని లోకేష్ అన్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా జగన్ దే బాధ్యత అని లోకేష్ అన్నారు. ఆధారాలు లేని కేసులో బెయిల్ రాకుండా జెల్ లోనే చంపేందుకు పెద్ద ప్లాన్ వేశారంటూ లోకేష్ ఆరోపించారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోంది.‌ బాబు గారికి జైలులో భద్రత లేదు, విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

Read Also : Meera Suicide: మీరాకి చీకటి అంటే భయం.. ఆత్మహత్యకు కారణం ఇదేనా?

లోకేష్ ట్వీట్ ఫై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (YCP MP Vijaya Sai Reddy) రివర్స్ అటాక్ చేసారు. జైలులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎలాంటి హాని లేదని , ఒకవేళ చంద్రబాబుకు హానీ కనుక ఉంటే అది కేవలం టీడీపీ నేతల వల్లేనని రివర్స్ అటాక్‌కు దిగారు. రాజమహేంద్రవరం జైల్లో..టీడీపీ నేతలే చంద్రబాబుకి హాని తలపెడతారన్న అనుమానం కలుగుతోంద‌ని ఎంపీ ఆరోపించారు. చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని కొట్టేయాలన్న కసి కొంతమంది టీడీపీ నాయకుల్లో కనిపిస్తోందంటూ విజయసాయి రెడ్డి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలతో జైలు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతూ.. ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ట్వీట్ చేశారు.

https://x.com/VSReddy_MP/status/1704782195725152598?