YCP : వైసీపీ నేతలు.. పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టాలని చూస్తున్నారా..?

  • Written By:
  • Publish Date - February 6, 2024 / 12:54 PM IST

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఓ తిక్క ఉంది..కానీ దానికో లెక్క ఉంది…తనను రెచ్చిగొడితే అస్సలు తగ్గడు..రెచ్చిగొట్టిన వారికీ ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడ..అప్పుడు చెపుతాడు..అందుకే పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టాలని ఎవ్వరు చూడరు. కానీ వైసీపీ నేతలు మాత్రం రివర్స్..పవన్ కళ్యాణ్ ను రెచ్చిపోతే ఏదొక నిర్ణయం తీసుకుంటారని..ఆ నిర్ణయం తో తాము విజయం సాధించవచ్చని చూస్తున్నారు.

ఏపీలో అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ పార్టీ 175 కు 175 సాధించాలని ప్రణాళికలతో వెళ్తుంది. ఇదే క్రమంలో టిడిపి సైతం జనసేన తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతుంది. ప్రస్తుతం సీట్లకు సంబదించిన కసరత్తులు నడుస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈసారి ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి..రెండు చోట్ల ఓటమి చెందారు. కానీ ఈసారి జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది. అదికాక టిడిపి తో బరిలోకి దిగుతుండడం తో ప్రజల్లో నమ్మకం పెరిగింది .అయితే పవన్ ఈసారి ఎక్కడ పోటీ చేసిన విజయం సాధించడం పక్క అని అంటున్నారు. కాకినాడ , భీమవరం , గాజువాక ఇలా పలు పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా ఎక్కడ అనేది ఫిక్స్ కాలేదు. ఈ లోపు వైసీపీ నేతలు పవన్ త్వరగా తన నియోజకవర్గాన్ని ప్రకటించాలని ఆయన్ను రెచ్చగొడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి..తాజాగా పవన్ ఫై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘పవన్ కాకినాడలో నాపై పోటీ చేయాలని గతంలో సవాలు చేశా. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నా. ఎప్పుడు పోటీ చేస్తారా అని ఎదురుచూస్తున్నా. ఆ సవాలుపై పవన్ కళ్యాణ్ ఇంకా స్పందించలేదు. ఒకవేళ తోకముడిస్తే పవన్ నాకు బహిరంగ క్షమాపణలతో పాటు నాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

మరోపక్క మాజీ మంత్రి పేర్ని నాని సైతం పవన్ ఫై పలు విమర్శలు చేసాడు. పవన్ కళ్యాణ్ కలియుగ శల్యుడంటూనాని విమర్శించారు. ‘నీకోసం ప్రాణం పెడతాం నువ్వు సీఎం కావాలి అని కార్యకర్తలు అడుగుతుంటే.. అరే మనకంత సీన్ లేదురా మనం పల్లకీని మోయడమే. నేను ఎమ్మెల్యేను అవలేను అంటూ వారి స్థైర్యాన్ని చంపే మాటల్ని మాట్లాడుతున్నావు. ఆయుధాల్ని పక్కన పడేయమని మీ కార్యకర్తలకు చెబుతున్నావు. నీలాంటి వాళ్లని భారతంలో శల్యుడితో పోలుస్తారు’ అని వ్యాఖ్యానించారు.

ఇలా ఎవరికీ వారు పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే పవన్ మాత్రం ఏమాత్రం రెచ్చిపోకుండా కూల్ గా అన్ని గమనిస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు బదులు తీర్చుకుందాం అన్నట్లు వెయిట్ చేస్తున్నాడు. అలాగే మనం ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం కాదు..నిల్చున్న ప్రతి చోట గెలిచి తీరాలని శ్రేణులకు తెలుపుతున్నాడు.

Read Also : Daksha Nagarkar: హీరోయిన్ కాళ్లపై అలాంటి కామెంట్స్ చేసిన నెటిజెన్.. దిమ్మతిరిగే విధంగా ఆన్సర్ ఇచ్చిన నటి?