ఏపీలో టీడీపీ కూటమి తో బిజెపి పొత్తు (BJP Alliance ) పెట్టుకోవడం తో ఆయా పార్టీలు సంబరాలు చేసుకుంటుంటే..వైసీపీ (YCP) మాత్రం బాబు (Chandrababu) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లపై నిప్పులు చెరుగుతూ సెటైర్లు వేస్తున్నారు. గత మూడు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా టీడీపీ కూటమి – బిజెపి పొత్తు ఫై చర్చలు జరుగుతూ వచ్చాయి. శనివారం సాయంత్రం పొత్తు ఖరారు చేస్తూ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఓ లెటర్ రూపంలో అధికారిక ప్రకటన చేశారు. ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రధాని మోడీ నేతృత్వంలో బీజేపీ-టీడీపీ- జనసేన దేశాభివృద్ధికి కట్టుబడి ఉంటుందని, ఏపీ అభివృద్ధికి ఎన్డీఏ కృషి చేస్తుందన్నారు.
ఇదిలా ఉంటె ఈ పొత్తు ఫై వైసీపీ నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. నిన్నటి వరకు పొత్తు ఖరారు కానీ చూద్దాం అన్నట్లు వేచి చూసిన అధికార పార్టీ నేతలు పొత్తు ఖరారు కావడం తో తమ నోటికి పనిచెప్పడం స్టార్ట్ చేసారు. ఎంత మంది కలిసి వచ్చినా వైసీపీదే గెలుపు అని మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీది అనైతిక పొత్తు అని విమర్శలు సంధించారు. ‘పొత్తులో ఉన్న ముగ్గురూ గతంలో తిట్టుకున్నారు. అమిత్ షాపై రాళ్లు వేయించింది చంద్రబాబు కాదా..? పాచిపోయిన లడ్డూ ఇచ్చారని పవన్ విమర్శించలేదా..? అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకం చంద్రబాబు. పొత్తు కోసం బాబు, పవన్.. అమిత్ షా కాళ్లపై పడ్డారు’ అని వ్యాఖ్యానించారు.
We’re now on WhatsApp. Click to Join.
మంత్రి గుడివాడ పొత్తు ఫై స్పందిస్తూ.. చంద్రబాబు ఏనాడైనా ఒంటరిగా పోటీ చేశారా..? ప్రశ్నించారు. ‘జగన్ను ఎదుర్కోలేకే పొత్తులు పెట్టుకుంటున్నారు. విపక్షాల పొత్తు కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారు. విపక్షాలను చూస్తేనే వైసీపీ బలం అర్థమవుతోంది. చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. పవన్, బాబు ఢిల్లీ వీధుల్లో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు’ అని మండిపడ్డారు.
Read Also : AP Politics : జనసేన నుంచి బీజేపీకి సీటు.. ఇది అన్యాయమే..!