Site icon HashtagU Telugu

Women’s Day : ఏపీలో మహిళలకు ఉమెన్స్ డే స్పెషల్ గిఫ్ట్

Ap Women's Day 2025

Ap Women's Day 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం (Women’s Day) సందర్భంగా మహిళల భద్రతకు ప్రత్యేకమైన చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా ‘ఉమెన్‌ సేఫ్టీ’ (women safety app) అనే యాప్‌ను అభివృద్ధి చేసి, అదనపు భద్రతా ఫీచర్లతో అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మహిళల భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి ప్రత్యేక మహిళా పోలీస్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సాధికారత వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వారోత్సవంలో భాగంగా హెల్ప్‌లైన్ నంబర్లు 112, 181, 1098పై విస్తృత అవగాహన కల్పించనున్నారు. మహిళల భద్రతపై అవగాహన పెంచడానికి చర్చా వేదికలు, వీడియో ప్రదర్శనలు, పెయింటింగ్ పోటీలు, మెడికల్ క్యాంపులు, స్వీయ రక్షణ శిక్షణ, వ్యాసరచన పోటీలు, ర్యాలీలను నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి, మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. పోక్సో కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Deputy CM Bhatti: ఆయ‌న రాజకీయం ఓ పాఠ్యాంశం.. డిప్యూటీ సీఎం భ‌ట్టి

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నేరాలు జరగే అవకాశమున్న ప్రదేశాల్లో సీసీ కెమెరాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పోలీసింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతం చేయడానికి డ్రోన్ల వినియోగాన్ని పెంచనుంది. ముఖ్యంగా, సోషల్ మీడియాలో మహిళలను దూషించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళల భద్రత కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, అత్యవసర సమయంలో తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా గత ప్రభుత్వం మహిళల రక్షణకు తీసుకున్న చర్యలను విమర్శిస్తూ, మాజీ మంత్రి పీతల సుజాత ఘాటుగా స్పందించారు. ‘దిశ’ చట్టం పేరుతో గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం నాటకాలాడిందని, మహిళా భద్రతకు ఎలాంటి ముఖ్యమైన చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి రూ.4,332 కోట్లు కేటాయించడం శుభపరిణామమని పేర్కొన్నారు. 2025-26 బడ్జెట్‌ను మహిళా సంక్షేమానికి కేటాయించిన విధానాన్ని అభినందిస్తూ ఇది రాష్ట్ర మహిళల భద్రతకు మరియు సాధికారతకు దోహదపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

CM Revanth: ఇది అనుకొని ప్ర‌మాదం.. ట‌న్నెల్ ప్ర‌మాదంపై సీఎం రేవంత్ స‌మీక్ష‌!

Exit mobile version