Site icon HashtagU Telugu

Endowment Assistant Commissioner : భర్త విదేశాల్లో..ఏపీలో భార్య గర్భం..వైసీపీ ఎంపీఫై పిర్యాదు

Endowments Assistant Commis

Endowments Assistant Commis

గడిచిన ఐదేళ్లలో వైసీపీ నేతల (YCP Leaders) అక్రమాలు , భూకబ్జా లు , దోపిడీలు మాత్రమే బయటకు వస్తుండగా..తాజాగా ఓ అక్రమ సంబంధం కూడా బయటపడింది. అది కూడా వైసీపీ ఎంపీ (YCP MP) అవ్వడం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. భర్త విదేశాల్లో ఉంటె..ఇక్కడ ఏపీలో భార్య గర్భం దాల్చింది. ఇది తెలిసి షాక్ కు గురయ్యాడు సదరు భర్త. ఆ గర్భం (Pregnant) దాల్చింది ఎవరో సాధారణ గృహణి కాదు.. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (Endowment Assistant Commissioner). దీంతో భార్యపై దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ కు భర్త ఫిర్యాదు చేసాడు.

We’re now on WhatsApp. Click to Join.

అమరావతికి చెందిన తాను విదేశాల్లో ఉండగా తన భార్య దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గర్భం దాల్చిందని ఆమె భర్త మదన్ మోహన్.. దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలంటూ కోరుతూ లేఖ రాశారు. తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ (XYZ), గవర్నమెంట్ ప్లీడర్ లే కారణమనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ.. భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చొరవతో 2021లో ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల దేవదాయ శాఖ అధికారిణిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె తీరుపై విమర్శలు వెల్లవెత్తాయి. అవినీతి ఆరోపణలతో పాటు ఉద్యోగుల్లోనూ తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను విధుల్లో నుంచి తొలగించారు. ఇక ఇప్పుడు ఆమె గర్భం దాల్చిన ఘటన కు సంధించిన వ్యవహారం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. దీనిపై ఇంతవరకు ఆ మహిళా అధికారి కానీ వైసీపీ ఎంపీ కానీ రియాక్ట్ కాలేదు. మరి ఇందులో ఎంత నిజం ఉంది..? అసలు కారకుడు సదరు ఎంపీనేనా..? లేక మరో వ్యక్తా.? అనేది తెలియాల్సి ఉంది.

Read Also : Cholesterol : తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ఎందుకు ముఖ్యం.?