Weavers Of Ponduru : ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు సిక్కోలు నేత కార్మికులు

Weavers Of Ponduru : ఈసారి దేశ రాజధానిలో జరిగే ఆగస్టు 15 వేడుకల్లో సామాన్యులను కూడా భాగస్వాములను చేయాలని కేంద్ర సర్కారు భావించింది.

  • Written By:
  • Publish Date - August 12, 2023 / 07:30 AM IST

Weavers Of Ponduru : ఈసారి దేశ రాజధానిలో జరిగే ఆగస్టు 15 వేడుకల్లో సామాన్యులను కూడా భాగస్వాములను చేయాలని కేంద్ర సర్కారు భావించింది. వైబ్రెంట్‌ విలేజెస్‌లో దేశంలోని ఎంపిక చేసిన గ్రామాల రైతులు, మత్స్యకారులు, నేతన్నలు, సర్పంచ్‌లు, టీచర్స్‌, నర్సులను ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవాలకు ఆహ్వానిస్తోంది. స్వాతంత్య్ర పోరాటంలో ఖాదీది కీలక పాత్ర అని చెప్పిన కేంద్రం..  దేశవ్యాప్తంగా 75 మంది నేత కార్మికులు ఈ వేడుకలకు ఆహ్వానిస్తోంది. అందులో శ్రీకాకుళం జిల్లా పొందూరు నుంచి ఇద్దరు నేత కార్మికులు ఉన్నారు. వారికి  ప్రత్యేక అతిథులుగా ఆహ్వానం అందింది. గత 35 ఏళ్లుగా నేత పని చేస్తున్న భద్రయ్య 100 కౌంటర్‌ బంగారు అంచు కలిగిన పంచెలు నేయడంలో దిట్ట. భద్రయ్య తన భార్య లక్ష్మితో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు. పొందూరుకు చెందిన నేత కార్మికురాలు(Weavers Of Ponduru )జల్లేపల్లి సూర్యకాంతం కూడా ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ ముగ్గురు  ఇవాళ ఢిల్లీకి  బయల్దేరి వెళ్లనున్నారు. మాజీ ప్రధానులు, ఇతర దేశాల ప్రతినిధులు కూర్చునే ఏరీయాలోనే వీళ్లకు సీట్లు ఇచ్చారు.

Also read : Today Horoscope : ఆగస్టు 12 శనివారం రాశి ఫలాలు.. వీరికి ఆకస్మిక గొడవలు, ఆకస్మిక ధనలాభం

పార్లమెంట్‌ భవనం సెంట్రల్ విస్టా నిర్మించిన కార్మికులు, సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ, అమృత్‌ సరోవర్‌ ప్రాజెక్టులు, హర్‌ఘర్ జల్ యోజన ప్రాజెక్టులకు సేవలు అందించిన సిబ్బందిని ఫ్యామిలీతో కలిసి రావాలని సూచించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, చేనేత కార్మికులు, మత్స్యాకారులు, భవన నిర్మాణ కార్మికులను  ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవాలకు ఆహ్వానిస్తోంది. వీరితోపాటు పీఎం కిసాన్ లబ్ధిదారులు 1800 మందిని ఆహ్వానించింది.

Also read : Botsa Challenge : బొత్స ‘గుండు ‘ ఛాలెంజ్..బండ్ల గణేష్ ను మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు..