CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..గతంలో ప్రధాని మోడీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారు. గత ఐదేళ్లు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ మోడీ చేతులమీదుగానే పనుల పునఃప్రారంభం అయ్యాయి అని చంద్రబాబు అన్నారు. మోడీ ప్రధాని అయ్యేసరికి భారత్ ఆర్థిక వ్యవస్థ పదో స్థానంలో ఉంది. భారత్ ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి ఎదిగింది. త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది. ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు పేదరిక నిర్మూలనకు మోడీ కృషి చేస్తున్నారు. దేశాభివృద్ధే లక్ష్యంగా ప్రధాని మోడీ పనిచేస్తున్నారని చంద్రాబాబు తెలిపారు.
Read Also: Amaravati Relaunch : మోడీని పొగడ్తలతో ముంచెత్తిన నారా లోకేష్
నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా అమరావతి
గతంలో మోడీని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు. ఇటీవల మోడీని కలిసినప్పుడు ఆయన చాలా గంభీరంగా ఉన్నారు. పహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధలో ఉన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటాం. మోడీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మోడీజీ మేమంతా మీకు అండగా ఉన్నాం అని చంద్రబాబు అన్నారు. భారత్ మాతాకీ జై అంటూ చంద్రబాబు నినాదాలు చేశారు. ప్రజలతోనూ సీఎం నినాదాలు చేయించారు. జూన్ 21న విశాఖలో యోగా డేకు ప్రధానిని ఆహ్వానిస్తున్నాం. నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా అమరావతిని అభివృద్ధి చేస్తాం. మోడీ సహకారంతో రాజధానిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. మూడేళ్ల తర్వాత అమరావతి ప్రారంభోత్సవానికి మోడీ రావాలి అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఐదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాట
సరైన సమయంలో సరైన నేత దేశాన్ని పరిపాలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మోడీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు. కలగణన చేయాలని మోడీ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. కులగణన చేయాలన్నది కేంద్రం తీసుకున్న గొప్ప నిర్ణయం. కూటమిగా పోటీచేసి 93 శాతం స్టైక్‌రేట్‌తో విజయం సాధించాం. వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోడీ సాయంతో గట్టెక్కిస్తున్నాయి. కేంద్రం సాయంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం అన్నారు. ఐదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాట పట్టించాం. అమరావతి కేవలం నగరమే కాదు.. ఐదు కోట్ల ప్రజల సెంటిమెంట్. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం అమరావతి. 29 వేలమంది రైతులు 34 వేల ఎకరాలు రాజధానికి ఇచ్చారు. అమరలింగేశ్వరస్వామి, కృష్ణానది, బౌద్ధారామాలకు నిలయం.. అమరావతి. వైసీపీ పాలనలో అమరావతి రైతులు ఎన్నో బాధలు అనుభవించారు.
నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా అమరావతిని అభివృద్ధి
అమరావతి లాంటి ఉద్యమాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. 2024లో ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంది. నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా అమరావతిని అభివృద్ధి చేస్తాం. మోడీ సహకారంతో రాజధానిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. ప్రపంచంలోని అన్ని నగరాలకూ అమరావతిని అనుసంధానం చేస్తాం. అమరావతిలో 5 లక్షలమంది విద్యార్థులు చదువుకునేలా ఏర్పాట్లు.. భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నా. విద్య, వైద్య కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. హరిత ఇంధనంతో కాలుష్యరహిత నగరంగా అమరావతిని మారుస్తాం. ఇప్పటికే అత్యుత్తమ విద్యాసంస్థలు అమరావతికి వచ్చాయి. బిట్స్ పిలానీ, ఎక్స్‌ఎల్ ఆర్ఐ వంటి మరిన్ని విద్యాసంస్థలు వస్తున్నాయి. 2027 నాటికి పోలవరం పూర్తవుతుంది. ఒక్క అమరావతినే కాదు.. అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తిచేస్తాం. భోగాపురం ఎయిర్‌పోర్టు వచ్చే ఏడాదికి పూర్తిచేస్తాం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ ఇచ్చినందుకు మోడీకి ధన్యవాదాలు. రాష్ట్రానికి గూగుల్, టీసీఎస్ రాబోతున్నాయి. తిరుపతిని ఆధ్యత్మిక నగరంగా తీర్చిదిద్దుతాం. కడపలో స్టీల్‌ప్లాంట్, రామాయపట్నంలో పోర్టు వస్తాయి. ఓర్వకల్లు నోడ్.. డ్రోన్ హబ్‌గా మారుతోందు. అమరావతి కోసం రైతులు వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లే అమరావతి పునః ప్రారంభమైందని సీఎం చంద్రబాబు అన్నారు.