Pawan Kalyan: ఏపి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ(Vijayawada)లోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ(Panchayati Raj Department) ఇంజినీరింగ్ విభాగం అధికారుల, ఏపియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారులతో సమీక్ష సమావేశం(Review meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నదులను దైవ స్వరూపాలుగా కొలవడం మన సంప్రదాయం, గోమాతను పూజిస్తుంటాం, కానీ వాటి సంరక్షణకు చర్యలు తీసుకోబోమని అన్నారు. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పై వారితో సమీక్ష జరిపారు. అనంతరం ఈ అంశంపై మాట్లాడుతూ.. చెత్త నిర్వహణ విషయంలో ప్రభుత్వపరంగా తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. రోజుకు రెండుసార్లు ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి, ప్రాసెసింగ్ సెంటర్ కు పంపించే ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
నదులను డంపింగ్ యార్డులు(Dumping yards)గా మార్చేశారుని చెప్పారు. చిన్నపాటి నీటి కుంటలు ఉన్న చోటును కూడా చెత్తతో నింపేశారని అన్నారు. ఈ విషయంలో కూడా ప్రజలు అవేర్ నెస్ పెంచుకోవాలని సూచించారు.నదులకు మొక్కుతూ, దైవంగా కొలుస్తూ మళ్లీ అందులోనే చెత్తను కుమ్మరించడం సరికాదని చెప్పారు. ప్లాస్టిక్ కవర్లను ఎక్కడపడితే అక్కడ పారేయడం వల్ల గోవులు వాటిని తిని చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, దీనికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ చెప్పారు. లేదంటే భవిష్యత్ తరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Read Also: Mahesh Babu : అంబానీ పెళ్లి వేడుకకు మహేష్ బాబు.. ఏపీ నుంచి వారుకూడా..
పనికిరాని వస్తువులతోనూ సంపద సృష్టించవచ్చని పవన్ కల్యాణ్(Pawan Kalyan) చెప్పారు. ఊడ్చి పడేసిన చెత్త నుంచి కొత్త సంపద సృష్టిస్తామని చెప్పారు. ఇంటింటికి తిరిగి రోజుకు రెండుసార్లు చెత్తను కలెక్ట్ చేసే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆపై దానిని ప్లాంట్ లో ప్రాసెస్ చేసి సంపద సృష్టిస్తామని వివరించారు. తొలుత దీనిని పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభిస్తామని, ఫలితాలు చూసి రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేస్తామని పేర్కొన్నారు. ప్రజలు కూడా దీనిని బాధ్యతగా తీసుకుని సహకరించాలని కోరారు. మాస్టర్ ట్రైనర్స్‌ను ముందు రెడీ చేసి.. వాళ్ల ద్వారా రాష్ట్రం మొత్తం శిక్షణ ఇస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు.
Read Also: Danam Nagender : బిఆర్ఎస్ లో మిగిలేది నలుగురే..దానం కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలోని 101 గ్రామ పంచాయతీల్లో చెత్తతో రూ.2600 కోట్ల ఆదాయం సమకూరిందని పవన్ కల్యాణ్ చెప్పారు. రెండున్నర లక్షల మందికి ఉపాధి లభించిందని తెలిపారు. స్వచ్చాంధ్ర ద్వారా దీనిని ప్రజల్లోకి తీసుకెళతామని పేర్కొన్నారు. గ్రామాల్లో రోడ్ల వెంబడి కొబ్బరి చెట్లు పెంచడం ద్వారా కొంత ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
Read Also: Jagan : టీడీపీ వైపు చూస్తున్న వైసీపీ ఎమ్మెల్సీలు..?