Indus Hospital Fire Accident : వైజాగ్ ఇండస్ హాస్పటల్ లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి

విశాఖపట్నం జగదాంబ సెంటర్ లోని ఇండస్ హాస్పటల్ (Indus Hospital)లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది.

  • Written By:
  • Updated On - December 14, 2023 / 01:41 PM IST

Indus Hospital Fire Accident : విశాఖపట్నం (Visakhapatnam) జగదాంబ సెంటర్ (Jagadamba Centre) లోని ఇండస్ హాస్పటల్ (Indus Hospital ) లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఆపరేషన్ థియేటర్లో చెలరేగిన మంటల కారణంగా దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిప్రమాదంలో పలువురు రోగులు చిక్కుకున్నారు. వీరిని మంటల్లో నుంచి బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. ఆసుపత్రి నుంచి భారీగా వెలువడుతున్న పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది. దీంతో స్థానికులలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ ఆసుపత్రి (Indus Hospital) పరిసర ప్రాంతాల్లోని షాపులను అధికారులు మూసేశారు.

We’re now on WhatsApp. Click to Join.

పొగలు వస్తుండటంతో ఊపిరాడక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రెండో అంతస్థు మాత్రమే కాకుండా ఆసుపత్రి నుంచి రోగులు బయటకు పరుగులు తీశారు. ఆసుపత్రిలో ఎందరు రోగులున్నారన్నది తెలియాల్సి ఉంది. అయితే చాలా మంది రోగులను ఆసుపత్రి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది రక్షించినట్లు సమాచారం. ప్రస్తుతం సుమారు 40 మంది రోగులను బయటకు తీసుకొచ్చి.. వారిని అంబులెన్స్‌లలో వివిధ ఆస్పత్రులకు తరలించారు.

ఆపరేషన్ థియేటర్లలో ఉన్న నైట్రస్ ఆక్సైడ్‌ పేలుళ్లు జరగడంతో భవనం మొత్తం మంటలు వ్యాపించాయని అంటున్నారు. ఐసీయూలలో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తరలించారు. ఫైర్‌, డిజాస్టర్‌ మేనేజ్మెంట్ సిబ్బంది వేగంగా స్పందించడంతో భవనంలో ఉన్న వారిని కాపాడారు. విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యన్నార్ స్వయంగా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆస్పత్రిలో దాదాపు అందరిని సురక్షితంగా బయటకు తరలించినట్టు చెబుతున్నారు. ఐసీయూలలో ఉన్న 15మందిని సురక్షితంగా బయటకు తరలించారు. మూడో అంతస్తులో ఉన్నవారిని కూడా ఫైర్ సిబ్బంది తరలించారు. రెండో అంతస్తులో మంటలు అదుపు రాలేదని, మొదటి, మూడో అంతస్తులో ఉన్న రోగులను కాపాడినట్లు పోలీసులు తెలిపారు.

Read Also : KCR : రేపు హాస్పటల్ నుండి కేసీఆర్ డిశ్చార్జ్