Viveka : `అక్బ‌ర్ బాషా`కోణం, అవినాష్ కు మైనార్టీల వార్నింగ్

వివేకా (Viveka) హ‌త్య కేసు విచార‌ణ వేళ అక్బ‌ర్ బాషాను వైసీపీ సీన్లోకి తీసుకొచ్చింది.

  • Written By:
  • Updated On - April 20, 2023 / 11:08 AM IST

మాజీ మంత్రి వివేకా (Viveka) హ‌త్య కేసు విచార‌ణ వేళ అక్బ‌ర్ బాషాను (akber basha)వైసీపీ సీన్లోకి తీసుకొచ్చింది. ఎవ‌రీ అక్బ‌ర్ బాషా? ఆయ‌న వెనుక ఏమి జ‌రిగింది? అనే ప్ర‌శ్న‌ల‌కు క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి కొత్త భాష్యం చెబుతున్నారు. రెండో వివాహం మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి చేసుకున్నార‌ని ఆయ‌న చేసే ఆరోప‌ణ‌. ఆ సంద‌ర్భంగా వివేకానంద‌రెడ్డి అక్బ‌ర్ బాషా గా పేరు మార్చుకున్నార‌ని చెబుతున్నారు. రెండో వివాహం తాలూకూ గొడ‌వ‌లు హ‌త్య‌కు దారితీసింద‌ని అవినాష్‌ రెడ్డి చెబుతోన్న మాట‌.

 వివేకా  హ‌త్య కేసు విచార‌ణ వేళ అక్బ‌ర్ బాషా(Viveka) 

ప్ర‌స్తుతం అవినాష్ రెడ్డి సీబీఐ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఆయ‌న విచార‌ణ కొన‌సాగ‌నుంది. కస్ట‌డీకి తీసుకున్న భాస్క‌ర్ రెడ్డి, ఉద‌య్ కుమార్ రెడ్డి, సునీల్ యాద‌వ్ త‌దిత‌రుల‌తో క‌లిసి అవినాష్ రెడ్డిని విచారించే అవ‌కాశం ఉంది. ఉద‌యం సీబీఐ విచార‌ణ‌ను ప్రారంభించింది. డీఐజీ స్థాయి అధికారి నాంప‌ల్లిలోని సీబీఐ ఆఫీస్ లో విచారిస్తున్నారు. ఎవ‌ర్నీ లోప‌ల‌కు అనుమ‌తించ‌కుండా కేవ‌లం అవినాష్ రెడ్డిని మాత్ర‌మే విచారిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేర‌కు ఈనెలాఖ‌రులోగా కేసు విచార‌ణ పూర్తి చేయాలి. ఆ క్ర‌మంలో (Viveka) విచార‌ణ వేగాన్ని సీబీఐ పెంచింది. ఆ లోపుగా రాజ‌కీయ‌ప‌ర‌మైన దుమారం రేగుతోంది.

రెండో వివాహం తాలూకూ ఉన్నాడ‌ని  ఫోటోల‌ను

గ‌తంలో నాలుగుసార్లు సీబీఐ ఎదుట అవినాష్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఇప్పుడు ఐదోసారి బుధ‌వారం సీబీఐ ముందుకొచ్చారు. మాజీ మంత్రి వివేకా (Viveka) హ‌త్య వెనుక వివాహేత‌ర సంబంధం ఉంద‌ని అవినాష్ చెబుతున్నారు. అంతేకాదు, రెండో వివాహం కార‌ణంగా ఏర్ప‌డిన వివాదాలు ఆయ‌న హ‌త్య‌కు దారితీశాయ‌ని రాత‌పూర్వ‌కంగా ఒక లేఖ‌ను సీబీఐకి అంద‌చేశారు. రెండో వివాహం సంద‌ర్భంగా అక్బ‌ర్ బాషాగా  (akber basha) ఆయ‌న పేరును కూడా మార్చుకున్నార‌ని అవినాష్ చెబుతున్నారు. ఒక కుమారుడు కూడా రెండో వివాహం తాలూకూ ఉన్నాడ‌ని కొన్ని ఫోటోల‌ను కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా వైసీపీ వైరల్ చేస్తోంది.

మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి హితవు (Viveka)

రెండో వివాహం తాలూకూ ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డం, అక్బ‌ర్ బాషాగా వివేకా (Viveka)పేరు మార్చుకోవ‌డాన్ని వైసీపీ ప్ర‌చారం చేస్తోన్న స‌మ‌యంలో ముస్లిం మైనార్టీ హ‌క్కుల స‌మితి బ‌య‌ట‌కు వ‌చ్చింది. మైనార్టీల గౌర‌వాన్ని కించ‌ప‌రిచేలా వైసీపీ మాట్లాడుతుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినాశ్ రెడ్డి ముస్లిం సమాజాన్ని కించపరిచేలా మాట్లాడడం బాధించిందన్నారు. విశ్వసనీయత, పరువు, మర్యాదలు వైఎస్ కుటుంబానికి మాత్రమే ఉన్నాయా? అని ప్రశ్నించారు.

షేక్ షెహన్‌షా అనే కుమారుడు

వివేకానందరెడ్డి (Viveka) అక్బర్‌బాషాగా మారారని, వీరికి షేక్ షెహన్‌షా అనే కుమారుడు ఉన్నాడని అవినాష్ చెప్ప‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. గ‌తంలో నారాసుర రక్త చరిత్ర అని ఆరోపించిన విషయాన్ని మర్చిపోయారా? అంటూ నిల‌దీస్తున్నారు.కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావును కాపాడేందుకు సమితి లీగల్ టీం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం నాలుగు సంవత్సరాలుగా నయా పైసా తీసుకోకుండా సేవలందిస్తున్నారని గుర్తు చేశారు షారూఖ్ వివేకా హత్యకేసులో డ్రైవర్ దస్తగిరి తప్పు తెలుసుకుని అప్రూవర్‌గా మారాడని, వాస్తవాన్ని వెల్లడించాడని అన్నారు. అలాంటి ముస్లిం సమాజంపై అవినాశ్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని షారూఖ్ షిబ్లీ హితవు పలికారు.

Also Read : Viveka Murder Case: వివేకాను హత్య కేసులో ట్విస్ట్.. దస్తగిరి సంచలన నిజాలు!

మొత్తం మీద సీరియ‌స్ విచార‌ణ జ‌రుగుతోన్న వేళ వివేకా రెండో వివాహం రాజ‌కీయ అంశంగా మారింది. ఆ క్ర‌మంలో ముస్లిం మైనార్టీ హ‌క్కుల స‌మితి బ‌య‌ట‌కు రావ‌డం గ‌మ‌నార్హం. ప‌లు కోణాల నుంచి అవినాష్ రెడ్డిని వివాదాలు చుట్టుముడుతున్నాయి. అందులో స‌మితి కూడా ఎంట‌ర్ కావ‌డంతో ఇక వివేకా రెండో వివాహం గురించి వైసీపీ మాట్లాడేందుకు ధైర్యం చేయ‌లేక‌పోతోంది.

Also Read : Avinash case :తాడేప‌ల్లి కోట‌కు ఊర‌ట‌,ఈనెల 25 వ‌ర‌కు కూల్