Viveka Murder : CBI విచార‌ణ‌కు AP CM జ‌గ‌న్ బ్ర‌ద‌ర్, తాడేప‌ల్లి కోట‌లో క‌ల్లోలం

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉండే తాడేప‌ల్లి నివాసం వ‌ద్ద (Viveka Murder) ఉత్కంఠ నెల‌కొంది. షెడ్యూల్ ప‌ర్య‌ట‌న‌లు హ‌ఠాత్తుగా ర‌ద్దు అవుతున్నాయి.

  • Written By:
  • Updated On - January 28, 2023 / 02:39 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉండే తాడేప‌ల్లి నివాసం వ‌ద్ద (Viveka Murder) ఉత్కంఠ వాతావ‌ర‌ణం నెల‌కొంది. మునుపెన్న‌డూ లేనివిధంగా షెడ్యూల్ ప‌ర్య‌ట‌న‌లు హ‌ఠాత్తుగా ర‌ద్దు అవుతున్నాయి. ఇంకో వైపు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ(CBI) విచారణకు హాజ‌రు కావ‌డం వైసీపీ వ‌ర్గాల్లో ద‌డ‌పుట్టిస్తోంది. ఆయ‌న్ను సీబీఐ అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని రెండు రోజులుగా వినిపిస్తోంది.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉండే తాడేప‌ల్లి నివాసం వ‌ద్ద (Viveka Murder)

బాబాయ్ మ‌ర్డ‌ర్ (Viveka Murder) కేసు విచార‌ణ వేగం అయిన ప్ర‌తిసారీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఉండేది. నాలుగు రోజుల క్రితం అవినాష్ రెడ్డికి సీబీఐ(CBI) స‌మన్లు ఇచ్చిన వెంట‌నే ఢిల్లీ టూర్ కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధ‌మ‌య్యారు. అయితే, అక్క‌డ నుంచి ఎలాంటి పాజిటివ్ సంకేతం రాక‌పోవ‌డంతో ర‌ద్దు చేసుకున్నారు. వాస్తవంగా ఆయ‌న 28వ తేదీన షెడ్యూల్ ప్ర‌కారం ఢిల్లీ వెళ్లారు. కానీ, ఆ టూర్ ను ఈనెల 30వ తేదీకి వాయిదా వేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆ రోజు కూడా ఢిల్లీ పెద్ద‌ల అనుమ‌తి ఉంటేనే ఆయ‌న ప‌ర్య‌ట‌న ఉండే అవ‌కాశం ఉంది.

Also Read : YS Murder : జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ్ర‌ద‌ర్ అరెస్ట్ కు రంగం సిద్ధం, క‌డ‌ప‌లో CBI వేట‌

వాస్త‌వంగా గుంటూరు జిల్లా పొన్నూరు, విశాఖ ప‌ర్య‌ట‌న‌ల‌ను నాలుగు రోజులు క్రితం సీఎంవో షెడ్యూల్ చేసింది. కానీ, ఆ ప‌ర్య‌ట‌న‌ల‌ను కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ర‌ద్దు చేసుకున్నారు. ఆయ‌న సోద‌రుడు అవినాష్ రెడ్డికి సీబీఐ స‌మ‌న్లు ఇచ్చిన‌ప్ప‌టి నుంచి సీఎంవో ఆఫీస్ షెడ్యూల్ మారిపోతోంది. వారం క్రితం తొలుత అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. హైద‌రాబాద్ లోని సీబీఐ ఆఫీస్ కు విచార‌ణ‌కు రావాల‌ని స‌మ‌న్లు ఇచ్చింది. కానీ, ఐదు రోజులు టైమ్ కావాల‌ని ఆయ‌న అడిగారు. అందుకు నిరాక‌రించిన సీబీఐ మ‌రోసారి రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేయ‌డంతో పాటు పులివెందుల‌కు వెళ్లింది. దీంతో ఒక్క‌సారిగా తాడేప‌ల్లి కోట‌లో హై టెన్ష‌న్ నెల‌కొంది.

హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి అవినాష్

శ‌నివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి అవినాష్ వెళ్లనున్నారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి మెజిస్ట్రేట్ ఎదుట‌ ఇచ్చిన వాంగ్మూలం మేర‌కు విచార‌ణ జ‌ర‌గ‌నుంది. తెలుగు రాష్ట్రాల‌ను గ‌త నాలుగేళ్లుగా ఉత్కంఠ‌కు గురిచేస్తోన్న ఈ కేసు వ్య‌వ‌హారం సీబీఐకి స‌వాల్ గా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు మ‌లుపులు తిరుగుతూ వ‌చ్చిన ఈ కేసును ఏపీ నుంచి తెలంగాణ‌కు బ‌దిలీ చేయ‌డం కీల‌క ప‌రిణామం. అంతేకాదు, సీబీఐ దూకుడు పెంచిన‌ట్టు క‌నిపిస్తోంది.

Also Read : YS Viveka Murder : వైఎస్ వివేకా హ‌త్య కేసులో కీల‌క ప‌రిణామం.. వైసీపీ ఎంపీకి సీబీఐ స‌మాన్లు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు ప్రారంభించింది. వివేకా హత్య కేసుకు సంబంధించిన ప్రధాన ఛార్జ్ షీట్, అనుబంధ చార్జ్ షీట్ లను విచారణకు స్వీకరించింది. ఐదుగురు నిందితులు ఉమాశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, శివశంకర్ రెడ్డిలకు సమన్లను జారీ చేసింది. ఫిబ్రవరి 10న విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసుకు SC/01/2023 నెంబర్ ను కేటాయించింది.

అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసే అవ‌కాశం

ఏపీ హైకోర్టు ఆదేశం మేర‌కు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. కొందరు సాక్షుల్ని ప్రశ్నించారు. ఈ కేసు విచారణ వేగవంతంగా సాగడం లేదని వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. దీంతో సుప్రీం కోర్టు వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. నిజాల‌ను తేల్చ‌డానికి ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. పైగా ఢిల్లీ పెద్ద‌లు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సానుకూలంగా లేర‌ని తెలుస్తోంది.

వివేకా మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి స్టేట్మెంట్ రికార్డ్

2019 ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వివేకానందరెడ్డి ఆయన ఇంట్లోనే హత్యకు గురైయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ హ‌త్య‌ను చేయించారని ఆనాటి ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆరోపణలు చేశారు. సీన్ క‌ట్ చేస్తే జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ కేసు నత్తనడకన సాగింది. చివరికి ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో అసలు నిందితులు బ‌య‌ట‌ప‌డ‌తార‌ని సామాన్యులు సైతం ఆదుర్తాగా ఎదురుచూస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు గ‌త మూడున్న‌రేళ్లుగా చోటుచేసుకున్నాయి. వివేకా మాజీ అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, యాదాటి సునీల్ యాదవ్, గజ్జల ఉమా శంకర్రెడ్డితో పాటు తాను కూడా హత్యలో పాల్గొన్నట్లు డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి వాగ్మూలం ఇచ్చారు. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద వివేకా మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి స్టేట్మెంట్ రికార్డ్ అయింది. ఏడాదికి పైగా విచారించిన సీబీఐ కడప స‌బ్ కోర్టూలోనూ వాంగ్మూలం సమర్పించింది. గ‌త ఏడాది నవంబర్ 11న దర్యాప్తు సంస్థ సబ్ కోర్టులో దస్తగిరి తరపున అప్రూవర్ పిటిషన్ను దాఖలు చేసింది.

Also Read : YS Viveka Case : జ‌గ‌న్ కు అవ‌మానం, తెలంగాణ‌కు బాబాయ్ హ‌త్య కేసు బ‌దిలీ

2019 మార్చి 15న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పులివెందులలోని తన ఇంట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. బెంగుళూరులో 2018-19లో జరిగిన భూ ఒప్పందం ద్వారా వచ్చిన సొమ్మును పంచుకోవడంలో వివాదమే హత్యకు కారణమని స్టెట్మెంట్లో దస్తగిరి తెలిపారు. 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓడిపోవడానికి గంగిరెడ్డి కారణమని వివేకా పలుసార్లు వ్యాఖ్యానించారని తెలిపారు. దస్తగిరి 2017 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ 2018 వరకు వివేకానందకు డ్రైవర్గా పనిచేసి ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ క్రమంలోనే వివేకానందకు సన్నిహితుడైన గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, సోదరుడు గజ్జల జగదీశ్వరరెడ్డితో పరిచయం ఏర్పడింది. బెంగళూరు ల్యాండ్ డీల్ ద్వారా వివేకానంద రెడ్డికి రూ.8 కోట్లు వచ్చాయి. ఆ మొత్తాన్ని పంచుకునే విషయంలో గంగిరెడ్డికి, వివేకానందరెడ్డికి మధ్య విభేదాలు వచ్చాయని ద‌స్త‌గిరి వాగ్మూలంలో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్ ఇంటి దగ్గర వివేకా వాగ్వాదం జ‌రిగింది. ఉద్దేశ‌పూర్వ‌కంగా ఓడించిన మీ కథ తేలుస్తానంటూ ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్ రెడ్డిలకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్లు కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో దస్తగిరి తెలిపారు.

హత్యకు మొత్తం 40 కోట్ల రూపాయల సుపారీ

2019 ఫిబ్రవరిలో వివేకానందరెడ్డిని హత్య చేసేందుకు పథకం రచించేందుకు సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలతో కలిసి గంగిరెడ్డి తనను పిలిచాడని తెలిపారు. ఎర్రగంగిరెడ్డి హత్యకు ప్లాన్ చేసినట్లు కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో దస్తగిరి పేర్కొన్నారు. కోటి రూపాయలు ఇస్తాం.. వివేకాను హత్య చేయాలని గంగిరెడ్డి ఆఫర్ చేశారని తెలిపాడు. నువ్వొక్కడివే కాదు, మేమూ వస్తాం కలిసి వివేకాను చంపేద్దామంటూ గంగిరెడ్డి చెప్పినట్టు దస్తగిరి స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ హత్య వెనుక అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, డి.శంకర్ రెడ్డి ఉన్నారని, ఆ విష‌యం తనకు ఎర్ర గంగిరెడ్డి చెప్పారని ద‌స్త‌గిరి తేల్చేశాడు. హత్యకు మొత్తం 40 కోట్ల రూపాయల సుపారీ తీసుకున్నట్లు వాగ్మూలం ఇచ్చాడు. తనకు 5 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసి ఇచ్చిన అడ్వాన్స్ లో 25 లక్షలు సునీల్ యాదవ్ తిరిగి తీసుకున్నాడని తెలిపాడు. తన స్నేహితుడు మున్నా దగ్గర మిగతా 75 లక్షలు దాచానన్న దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి కలిసి వివేకా ఇంటి దగ్గర కుక్కను కారుతో తొక్కించి చంపేశారని తెలిపాడు.

Also Read : YS Murder :రాజ‌కోట ర‌హ‌స్యంపై ష‌ర్మిల కామెంట్స్, మ‌ళ్లీ పాద‌యాత్ర‌కు రెడీ!

సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలతో కలిసి తాను వివేకా ఇంటి కాంపౌండ్ లోకి దూకి లోపలికి వెళ్లానని, అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి తలుపు తీయడంతో లోపలికి వెళ్లినట్లు స్టెట్మెంట్ ఇచ్చాడు. తనను చూసిన వివేకా ఈ సమయంలో వీళ్ళెందుకు వచ్చారని నిర్ఘాంతపోయారని, తర్వాత వివేకా బెడ్ రూమ్ లోకి వెళ్లడంతో అతని వెనుకే గంగిరెడ్డి కూడా వెళ్లాడని చెప్పాడు. వివేకా బెడ్ రూమ్ లో డబ్బు గురించి తీవ్ర వాగ్వాదం జరిగిందని, వివేకాను బూతులు తిడుతూ మొహంపై సునీల్ యాదవ్ దాడి చేసినట్టు దస్తగిరి వెల్లడించాడు. తన చేతిలోని గొడ్డలితో సునీల్ యాదవ్ వివేకాపై దాడి చేశాడని, వెంటనే వివేకా కింద పడిపోవడంతో అతని ఛాతీపై 7,8 సార్లు సునీల్ యాదవ్ బలంగా కొట్టినట్టు దస్తగిరి తెలిపాడు.

Also Read : YS Viveka Case : వివేక హ‌త్య‌లో జ‌గ‌మంత‌ కుటుంబం?

మొత్తం మీద వివేకా మాజీ డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి ఇచ్చిన వాగ్మూలం ప్ర‌కారం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ్ర‌ద‌ర్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించ‌నుంది. ఆయ‌న్ను అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దీంతో వివేకా హ‌త్య కేసు సుఖాంతం అవుతుంద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టెన్ష‌న్‌. అదే జ‌రిగితే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఆ ర‌క్త‌పు మ‌ర‌క‌లు అధికారికంగా అంటుకుంటాయ‌ని వైసీపీ ఆందోళ‌న చెందుతోంది.