Viveka murder : ఏపీ రాజ‌కీయాల్లో `ర‌క్త `సిత్రాలు! `జ‌గ‌నాసుర ర‌క్త‌చ‌రిత్ర‌`విడుద‌ల‌!

ఏపీ రాజ‌కీయాన్ని `ర‌క్త చ‌రిత్ర` వేడెక్కిస్తోంది. వివేకా హ‌త్య(Viveka murder)

  • Written By:
  • Updated On - February 10, 2023 / 01:38 PM IST

ఏపీ రాజ‌కీయాన్ని `ర‌క్త చ‌రిత్ర` వేడెక్కిస్తోంది. మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య(Viveka murder) సూత్ర‌ధారి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిగా టీడీపీ భావిస్తోంది. ఆ మేర‌కు `జ‌గ‌నాసుర ర‌క్త‌చరిత్ర‌` పుస్త‌కాన్ని ఏపీ టీడీపీ(TDP) విడుద‌ల చేసింది. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి బాబాయ్ వివేకానంద‌రెడ్డిని హ‌త్య చేయించాడని టీడీపీ ఏపీ లీడ‌ర్లు తేల్చేశారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా సీబీఐ విచారిస్తోన్న ఎంపీ అవినాష్ రెడ్డి, భార‌తి వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు న‌వీన్ ఎపిసోడ్‌ల‌ను ఉటంకిస్తున్నారు. సీబీఐ విచార‌ణ వేగంగా జ‌రుగుతోన్న టైమ్ లో వివేకా హ‌త్య‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేయించాడ‌ని టీడీపీ నిర్థారించ‌డం రాజ‌కీయాన్ని హీటెక్కించింది.

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య(Viveka murder)

గ‌త ఎన్నిక‌ల‌కు కొన్ని రోజుల ముందుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాబాయ్ వివేకానంద‌రెడ్డి హ‌త్య (Viveka murder) జ‌రిగింది. తొలుత గుండెపోటుగా సొంత ఛాన‌ల్ ద్వారా వ‌చ్చిన‌ ప్ర‌చారం, ఆ త‌రువాత గొడ్డ‌లిపోటుగా మారింది. స‌రిగ్గా ఇక్క‌డే ప‌లు అనుమానాల‌కు తావిచ్చింది. అప్ప‌ట్లో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్ప‌టికీ కేసుకు సంబంధించిన ఆధారాల‌ను వెంట‌నే సేక‌రించ‌లేక‌పోయారు. నిఘాధిప‌తి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఆనాడు ఉన్నారు. ఏపీ ప్ర‌భుత్వం విచార‌ణ‌కు వేసిన సిట్ ను కాద‌ని సీబీఐ విచార‌ణ కావాలని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అప్పుడు కోరారు. విచిత్రంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన త‌రువాత సీబీఐ విచార‌ణ అవ‌స‌రంలేద‌ని మాట మార్చారు. స‌రిగ్గా ఇక్క‌డే వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీతకు అనుమానం వ‌చ్చింది. సుప్రీం కోర్టు వ‌ర‌కు న్యాయం పోరాటం చేయ‌డంతో సీబీఐ కేసును విచారిస్తోంది.

కడ‌ప జైలు నుంచి చంచ‌ల్ గూడ జైలుకు..

ఏపీ ప‌రిధి నుంచి వివేకా హ‌త్య(Viveka murder) కేసును తెలంగాణ‌కు మార్చారు. అంతేకాదు, క‌డ‌ప జైల్లో ఉన్న నిందితుల‌ను తాజాగా చంచ‌ల్ గూడ జైలులో ఉంచాల‌ని సీబీఐ కోర్టు ఆదేశించింది. హైద‌రాబాద్ సీబీఐ కార్యాయాల‌యానికి శుక్ర‌వారం రోజు బెయిల్ మీద ఉన్న ఎర్ర గంగిరెడ్డి, డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి హాజ‌ర‌య్యారు. కడప జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సునీల్ కుమార్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలను భారీ భద్రత మధ్య కడప నుంచి హైదరాబాద్ కు విచార‌ణ నిమిత్తం తీసుకొచ్చారు. వ‌చ్చే నెల 10వ తేదీకి విచార‌ణ‌ను వాయిదా వేస్తూ కోర్టు నిర్ణ‌యం తీసుకుంది. అయితే సీబీఐ అభ్య‌ర్థ‌న మేర‌కు క‌డ‌ప జైలు నుంచి తీసుకొచ్చిన నిందితుల‌ను చంచ‌ల్ గూడ జైలుకు త‌ర‌లించారు. ఇదో కీల‌క ప‌రిణామంగా వివేకానంద హ‌త్య కేసులో సంత‌రించుకుంది.

Also Read : CBN-Jagan : TDP సానుభూతి మీడియా అత్యుత్సాహం, ప‌క్క‌లో బ‌ల్లెంలా JSP !

దూకుడుగా సీబీఐ విచార‌ణ సాగిస్తున్న త‌రుణంలో రాజ‌కీయ దాడిని జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మీద టీడీపీ(TDP) ముమ్మ‌రం చేసింది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర కీలక నేతలు `జ‌గ‌నాసుర ర‌క్త‌చ‌రిత్ర` పుస్తకాన్ని రిలీజ్ చేశారు. రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రికీ ఈ పుస్త‌కాన్ని పంచిపెట్టాల‌ని లక్ష్యంగా పెట్టుకున్నారు. మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌రిగిన తీరును వివ‌రిస్తూ ఆ పుస్త‌కంలో పొందుప‌రిచారు. అంతేకాదు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తండ్రి వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు లక్ష కోట్ల రూపాయల అవినీతి చేసిన వైనాన్ని తెలియ‌చేస్తూ ఆయ‌న నేర ప్ర‌వృత్తిని పుస్త‌కంలో ఆవిష్క‌రించారు. 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రాలేననే భయంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎన్నో డ్రామాలు ఆడార‌ని అచ్చెంనాయుడు ఆరోపించారు. వాటిలో ప్ర‌ధానంగా విశాఖ‌ ఎయిర్ పోర్టులో కోడికత్తి ఉంద‌ని అన్నారు .అయిన‌ప్ప‌టికీ ప్ర‌జల్లో మార్పు రాలేద‌ని గ‌మ‌నించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంత బాబాయ్ వివేకాను హత్య చేయించారని ఆరోపించారు. మూడున్నర గంటల సేపు వివేకాను హింసిస్తూ, గొడ్డలితో నరికి హిసించి చంపార‌ని, పుస్త‌కంలో అన్నీ వివ‌రాలు ఉన్నాయ‌ని వెల్ల‌డించారు.

 చంద్ర‌బాబు మీద విజ‌య‌వంతంగా  ‘నారాసుర రక్తచరిత్ర’ వైసీపీ నేత‌లు రుద్దారు..(TDP)

హ‌త్య జ‌రిగిన త‌రువాత చంద్ర‌బాబు(TDP) మీద విజ‌య‌వంతంగా వైసీపీ నేత‌లు రుద్దారు. ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ సొంత పత్రికలో జగన్ ప్రచారం చేయించారు. చంద్రబాబు పరపతిని దెబ్బతీసేలా ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడు సీబీఐ విచారణలో వాస్తవాలన్నీ వెలుగులోకి వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ జగన్ మాట్లాడకపోడం దారుణమని టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. వీలైనంత త్వరగా హంతకులను సీబీఐ శిక్షించాలని కోరుతూ `జ‌గ‌నాసుర రక్త‌చ‌రిత్ర‌` పుస్త‌కాన్ని ఏపీ వ్యాప్తంగా పంచాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది. ఆ క్ర‌మంలో ఏపీ రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది.

Also Read : Jagan : జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 100 అబ‌ద్ధాలు! కాలం చెల్లిన `వైఎస్` విశ్వ‌స‌నీయ‌త !!